అచ్చెన్నాయుడికి కరోనా, విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు, లోకేశ్..

మాజీమంత్రి అచ్చెన్నాయుడికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన చెందాయి. అచ్చెన్నాయుడుకి కరోనా వచ్చిందని తెలిసి చంద్రబాబు బాధపడ్డారు. విషయం తెలిశాక వేదనకు గురయ్యానని పేర్కొనారు. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని తెలిపారు. ఆయన పూర్తి ఆరోగ్యవంతుడు అవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని వెల్లడించారు.

 chandrababu saddened to hear atchannaidu tested corona positive

అచ్చెన్నాయుడికి కరోనా వచ్చిందని తెలిసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు చిన్నాన్న కరోనా వైరస్‌ను జయిస్తారని అన్న కుమారుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈఎస్ఐ కొనుగోళ్ల అవకతవకల కేసులో అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఇప్పటికే పైల్స్ కు శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత కూడా రక్తస్రావం కావడంతో మరోసారి సర్జరీ చేయించుకున్నారు. ఈ సమయంలో అతనికి కరోనా వచ్చిందని తెలిసింది. అచ్చెన్నాయుడు ప్రస్తుతం గుంటూరు రమేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అచ్చెన్నాయుడికి కరోనా రావడానికి ప్రభుత్వ వేధింపులే కారణం అని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+