కురుక్షేత్రానికి కౌంట్ డౌన్, ఢిల్లీలో మోదీ, ఇక్కడ మేమే, జగన్ గుండెల్లో దడ పుట్టింది, చంద్రబాబు !
భారతదేశానికి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అవుతారని, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని, ఆంధ్రాలో డబుల్ ఇంజిన్ సర్కారు రావడం గ్యారెంటీ అని మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. కూటమి దెబ్బకు జగన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు
తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ తో కలిసి మాట్లాడిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, వైకాపా సర్కారుపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో కళకళలాడుతోందని, వైసీపీ మేనిఫెస్టో బంగాళాఖాతంలో కలిసిపోందని, జగన్ పార్టీకి డిపాజిట్లు కూడా గల్లంతు అవుతాయని, ఢిల్లీలో మోదీ కుర్చుంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుతీరుతుందని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ప్రజాగళం మేనిఫెస్టో, సూపర్-6 లకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, మీ ఉత్సాహం చూస్తుంటే తనకు ఇప్పుడే పండగ వచ్చినంత ఆనందంగా ఉందని చంద్రబాబు నాయుడు చెప్పారు. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు నెల్లూరు ఎంతో తనకు తిరుపతి అంటే అంతే అని, ఇక్కడే పుట్టి పెరిగానని, తిరుపతిలో గల్లీగల్లీలో తిరిగి తాను ఎస్ వీ యూనివర్శిటీలో విద్యార్థి సంఘం నాయకుడు అయ్యానని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు.
తాను విద్యార్థి సంఘం నాయకుడిగా పని చేసి తరువాత రాజకీయాల్లోకి తిరుపతి నుంచి ఎంట్రీ ఇచ్చానని, ఈ రోజు మీ అశీస్సులు, వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో తాను ఇంతటి వాడిని అయ్యాయని, తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అది తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దయ, మీ ఆదరణ అని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతి రుణం తీర్చుకోవడానికి తనకు త్వరలో అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నానని చంద్రబాబు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇదే నెల 13వ తేదీన జరిగే కురుక్షేత్ర యుద్దంలో కౌరవ వధ తప్పదని, తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంతా మంచే జరుగుతుందని చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. నేను పుట్టిన స్థానం తిరుపతి, నేను పెరిగిన స్థానం తిరుపతి, నాకు విద్యార్థి నాయకుడిగా భిక్ష పెట్టింది తిరుపతి, తనకు పునర్జన్మ ఇచ్చింది ఇదే తిరుపతి అని, పవన్ కల్యాణ్ కు కూడా తిరుపతి ఓ సెంటిమెంట్ అని, ఇప్పుడు ఇద్దరూ ఇదే తిరుపతికి వచ్చామని, ఇద్దరూ కలిసి తిరుపతి, తిరుమల పవిత్రతను కాపాడుతామని బహిరంగంగా మాట ఇస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్పారు.

తాను సీఎంగా ఉన్న సమయంలో ప్రతినెల రెండో మంగళవారం తిరుపతి ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అవకాశం ఇచ్చామని, తరువాత వచ్చిన ధుర్మార్గులు తిరుపతి ప్రజలకు అలాంటి అవకాశం లేకుండా చేశారని, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తిరుపతి ప్రజలకు మళ్లీ అలాంటి అవకాశం కల్పిస్తామని మాజీ సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ కూడా హామీ ఇచ్చారు.
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆగడాలు, దందాలు, వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే భూమన కుమారుడిని చిత్తుగా ఓడించాలని, కూటమి అభ్యర్థి, జనసేన పార్టీ అభ్యర్థి అరణి శ్రీనివాసులను, ఎంపీ బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ రావ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ తిరుపతి ప్రజలకు మనవి చేశారు. అంతకు ముందు తిరుపతిలో జరిగిన భారీ ర్యాలీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు అడుగడుగునా ప్రజలు స్వాగతం పలకడంతో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఉత్సాహంతో ఉన్నారు.
-
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !!












Click it and Unblock the Notifications