వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇవాంక హైదరాబాద్ రాక మా ఘనతే: చంద్రబాబు అనేశారు

|
Google Oneindia TeluguNews

అమరావతి: అందరూ ఊహించినట్లే చంద్రబాబు అదే మాట అన్నారు....అనడమే కాదు తన మాటలకు వివరణ కూడా ఇచ్చారు. అయితే విమర్శకులు మాత్రం చంద్రబాబు మాటలను కొట్టిపడేస్తున్నారు...ఎక్కడ ఏ ఘనకార్యం జరిగినా అది తమ గొప్పతనమేనని చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటేనని ఎద్దేవా చేస్తున్నారు.

ఇంతకీ చంద్రబాబు ఏమన్నారంటే....ఇవాంక హైదరాబాద్ కు రావడం టిడిపి ఘనతే అన్నారు...అంతే కాదు ఇవాంకకు ఎన్నో ఆహ్వానాలు వచ్చినా కాదని హైదరాబాద్ ను సెలక్ట్ చేసుకోవడానికి కారణం తామేనని నొక్కివక్కాణించారు. అందుకు కారణాలు కూడా విడమర్చి చెప్పారు. ఇంతకీ చంద్రబాబు ఈ మాటలను ఎక్కడ ఎప్పుడు అన్నారంటే....

Recommended Video

Ivanka Trump Visit : వైట్ హౌస్ నుంచి పర్యవేక్షణ, కనీవిని ఎరుగని సెక్యూరిటీ | Oneindia Telugu
 బాబు ఏమన్నారంటే...

బాబు ఏమన్నారంటే...

హైదరాబాద్‌కు ఇవాంకా ట్రంప్‌ రావడం టిడిపి ఘనతేనని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బల్లగుద్ది చెప్పారు. హైదరాబాద్‌లో టిడిపి కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యులతో శుక్రవారం జరిగన సమావేశంలో ఆయన ఈ మాట అన్నారు. అంతేకాదు ఇవాంక రావడం తమ ఘనతేనని తాను ఎలా చెప్పగలిగానో వివరణ కూడా ఇచ్చారు.

 ఎందుకంటే...

ఎందుకంటే...

ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి అధికారంలో ఉండగా హైటెక్స్‌ సహా హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయికి చేర్చామన్నారు. ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు, ప్రాజెక్టుల వల్లే అది సాధ్యపడిందన్నారు. అందువల్లే 8 రాష్ట్రాల నుంచి ఆహ్వానం వచ్చినా, ఇవాంకా ట్రంప్‌ హైదరాబాద్‌కే రావడానికి అంగీకరించారన్నారు.

 విమర్శకులు,నెటిజన్ల ఎద్దేవా....

విమర్శకులు,నెటిజన్ల ఎద్దేవా....

చంద్రబాబు వ్యాఖ్యలపై విమర్శకులు,నెటిజన్లు మాత్రం జోకులు వేస్తున్నారు. ఎక్కడ ఏ గొప్ప పని జరిగినా అది తన వల్లేనని చంద్రబాబు చెబుతుంటారని, అది ఆయనకు ఒక అలవాటుగా మారిపోయిందని ఎద్దేవా చేస్తున్నారు. పైగా అసలు ఇవాంకా ను ఆంధ్రప్రదేశ్ కు రప్పించాలని చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేశారని, అయినా సాధ్యం కాలేదని విమర్శిస్తున్నారు. ఇవాంకాను ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టించాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైన సంగతి మీడియాలో కూడా వార్తలుగా వచ్చాయంటున్నారు.

 చంద్రబాబు ప్రయత్నాలు...

చంద్రబాబు ప్రయత్నాలు...

నవ్యాంధ్రకు బ్రాండ్ ఇమేజ్ రప్పించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న చంద్రబాబు ఇవాంక హైదరాబాద్ రానున్నారనే విషయం తెలియగానే అప్రమప్తమయ్యారట. అందులోను ఆమె అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ కు రానుండటం చంద్రబాబుని ఆలోచింపజేసిందట. ఎలాగైనా ఇవాంకా ట్రంప్ ను ఆంధ్రప్రదేశ్ కు రప్పించగలిగితే చాలా ప్రయోజనాలు ఉంటాయని ఆయన అంచనా వేశారట.

ఇవాంకా వస్తే...

ఇవాంకా వస్తే...

ఇవాంక ఆంధ్రప్రదేశ్ కు వస్తే ఎపికి అంతర్జాతీయ గుర్తింపు వస్తుందనేది చంద్రబాబు అంచనా. దీంతో పాటు ఎపికి అమెరికా కంపెనీల పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు మెండుగా ఉంటాయని బాబు ఆలోచించారట. అందుకే ఇవాంకను ఆంధ్రప్రదేశ్ కు రప్పించాలని పలు ప్రయత్నాలు చేశారట. ఇవాంక తమ ఆహ్వానాన్ని మన్నించి అమరావతికి గాని,విశాఖపట్టణానికి గాని వస్తే ఈమె రాక ను పురస్కరించుకొని
ఒక భారీ ఈవెంట్ ను కూడా నిర్వహించాలని ప్లాన్ చేశారట.

 నో అన్న అమెరికా అధికారులు...

నో అన్న అమెరికా అధికారులు...

కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలకు అమెరికా అధికారులు చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇవాంక వ్యాపారవేత్తల సదస్సు తప్ప మరో కార్యక్రమంలో పాల్గోదని అమెరికా కౌన్సులేట్ స్పష్టం చేసేసిందట. ఈ విషయాన్ని ఓ అధికారి వెల్లడించినట్లు తెలంగాణా మీడియాలో వార్తలు వచ్చాయి.

 బాబు ధోరణిపై...

బాబు ధోరణిపై...

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రప్పించుకోవాలని చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పులేదని విమర్శకులు అంటున్నారు. ఇవాంక ను ఆంధ్రప్రదేశ్ కు రప్పించడం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆలోచించడం చంద్రబాబు ముందు చూపుకు నిదర్శనమంటున్నారు. అయితే తమ వల్లే ఇవాంక హైదరాబాద్ కు వచ్చిందని మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు. హైదరాబాద్ కు శతాబ్ధాల నుంచే ఘన చరిత్ర ఉందనే విషయాన్ని మరువరాదని గుర్తుచేస్తున్నారు. అలాగే ఎక్కడ ఏ గొప్ప పని జరిగినా అది తమ వల్లేనని చెప్పే అలవాటును బాబు మార్చుకోవాలని, లేకుంటే విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు విశ్లేషిస్తున్నారు.

English summary
Amaravathi: AP CM Chandrababu said that the arrival of Ivanka to Hyderabad only because Of TDP. But the critics of Chandrababu are rejecting it. N Chandrababu Naidu's efforts to invite US President Donald Trump’s daughter Ivanka Trump to Amaravathi did not yield results. According to reports, Ivanka turned down the CM plea to come to Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X