Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైసీపీకి గుణపాఠం చెప్పండి .. టీడీపీ కరపత్రాలు పంచండి , ప్రలోభాలను అడ్డుకోవాలన్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ పోరు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రతిష్టాత్మకంగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి గట్టిగా బుద్ధి చెప్పాలని చంద్రబాబు గ్రామ ఓటర్లకు పిలుపునిస్తున్నారు. మీ గ్రామాన్ని మీరే బాగు చేసుకోవాలని, ఉదాసీనంగా వ్యవహరిస్తే పాడు చేసుకున్నట్లే అని చంద్రబాబు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలకు ఎన్నికల సందర్భంగా దిశానిర్దేశం చేస్తున్న చంద్రబాబు వైసీపీ దాడులు ,దౌర్జన్యాలపై ఫిర్యాదులు చెయ్యాలని తెలుగుదేశం పార్టీ నేతలను అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

సమర్దులను ఎన్నుకోండి .. వూరు బాగుపడుతుంది

సమర్దులను ఎన్నుకోండి .. వూరు బాగుపడుతుంది

తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు పంచాయతీ ఎన్నికలు చాలా కీలకమైనవని, స్థానిక స్వపరిపాలన ద్వారా అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఎన్నికల్లో సమర్థులను ఎన్నుకోవటం ఊరు బాగు పడటానికి బాటలు వేస్తుందని పేర్కొన్నారు. సర్పంచ్ సమర్ధులైతే ప్రతి ఊరు బాగు పడుతుందని చంద్రబాబు, సమర్థులకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికలలో ఉదాసీనంగా వ్యవహరించవద్దన్నారు.

వైసీపీ దాడులు, దౌర్జన్యాలను ఫోటోలు , వీడియోలు తీసి పంపండి

వైసీపీ దాడులు, దౌర్జన్యాలను ఫోటోలు , వీడియోలు తీసి పంపండి


వైసీపీ దాడులు, దౌర్జన్యాలకు పాల్పడే అవకాశం ఉంటుందని, అలాంటి ఘటనలు జరిగితే దాడులు, దౌర్జన్యాలపై ఫోటోలు, వీడియో సాక్ష్యాధారాలను వాట్సాప్ నెంబర్ 7557557744 కు పంపాలని, కాల్ సెంటర్ నెంబర్ 7306299999 కు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సమయానికి టిడిపి అంతర్గత ఎన్నికల కమిటీలను ఏర్పాటు చేసింది. అంతర్గత జోన్ కమిటీలను, పార్టీ కేంద్ర కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి ఎన్నికల సరళిని పరిశీలిస్తుంది.

వైసీపీని ఓడించి గుణపాఠం చెప్పండి

వైసీపీని ఓడించి గుణపాఠం చెప్పండి

ఇదే సమయంలో కడప జిల్లా ప్రొద్దుటూరులో కడప లోక్సభ నియోజకవర్గం పార్టీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి అరెస్టుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతలపై అక్రమ కేసులను ఎత్తివేసి వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. ఇప్పటికే బలవంతపు ఏకగ్రీవాలు జరక్కుండా చూడాలని, ఏ సమస్య వచ్చినా కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి అక్కడ న్యాయ సహాయం తీసుకోవాలని చంద్రబాబు సూచించారు .ఇక ప్రలోభాలను అడ్డుకోవాలని వైసీపీని ఓడించి గుణపాఠం చెప్పాలని చంద్రబాబు తెలిపారు.

ఎన్నికలలో మద్యం, డబ్బు ఎక్కడ పంచినా అడ్డుకోండి

ఎన్నికలలో మద్యం, డబ్బు ఎక్కడ పంచినా అడ్డుకోండి

గత 20 నెలల్లో వైసిపి ఎక్కడా ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని పేర్కొన్నారు.చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేయాలని సూచించారు రైతులు, రైతు కూలీలు, భవన నిర్మాణ కార్మికులు ఈ ఎన్నికల్లో వైసిపి కి తగిన గుణపాఠం చెప్పాలని చంద్రబాబు కోరారు. ఒక కుటుంబం పై పనులు అప్పుల రూపంలో 20 నెలల్లో రెండు లక్షల ఆర్థిక భారాన్ని పెంచిందని పేర్కొన్న చంద్రబాబు, గ్రామాల అభివృద్ధి చెందాలంటే సమర్ధుల ను ఎన్నుకోవాలి అన్నారు. ఎన్నికలలో మద్యం, డబ్బు ఎక్కడ పంచినా అడ్డుకోవాలని, పంచాయతీ ఎన్నికల ప్రలోభాలు తిప్పికొట్టాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+