కుప్పం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం పదవి ముళ్ల కిరీటం, పూలకిరీటం కాదు: బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: ప్రస్తుత స్థితిలో ముఖ్యమంత్రి పదవి పూల కిరీటం కాదని, ముళ్ల కిరీటమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజల ఆశీస్సులు కావాలని ఆయన అన్నారు.

చిత్తూరు జిల్లా రామకుప్పంలో చంద్రబాబు సోమవారంనాడు పలు ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఖాళీ ఖజానా ఇచ్చారని, జీతాలు ఇవ్వడానికి కూడా నిధులు లేవని ఆయన అన్నారు. కష్టపడి డబ్బులు సంపాదించాలని, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, తద్వారా సమీక్ష కార్యక్రమాలు చేసి, ప్రజల జీవితాలు బాగు చేయాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఉందని అన్నారు.

Chandrababu says CM post is crown of thrones

కష్టపడడం తనకు కొత్తకాదని, 24 గంటలు పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్రంలో మనం భాగస్వాములమని, కేంద్ర సహకారం ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాల అభివృద్ధి చేయాలంటే దానికి నిధులు కావాలని, సహకరించే విధానం కావాలని అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని చంద్రబాబు చెప్పారు.

ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన హామీనలు అమలు చేస్తాను తప్ప వెనుతిరిగేది లేదని ఆయన స్పష్టం చేశారు. శరీరంలో చివరి రక్తం బొట్టు ఉన్నంతవరకు రైతాంగానికి న్యాయం చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని, సంక్షోభాన్ని సవాల్‌గా తీసుకుని ఏపీని అభివృద్ధి చేస్తానని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన అన్నారు.

కుప్పంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని అన్నారు. బోర్లు ఎండిపోయాయని ఆయన అన్నారు. బోర్లు ఎండిపోయాయని ఆయన చెప్పారు. నీరు - మీరు లాంటి పనుల ద్వారా భూగర్భ జల మట్టాన్ని పెంచుతామని చంద్రబాబు చెప్పారు. డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు మాఫీ చేస్తామని ఆయన చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు.

English summary
Telugudesam party president and Andhra Pradesh CM Nara Chandrababu Naidu said that the chief minister post is not a crown of flowers, it is a crown of thrones.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X