ప్రతిదానికీ: జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం, కాపులకు చెప్పా.. చేస్తా

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు ప్రతిపక్షాల పైన దుమ్మెత్తి పోశారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్ష నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తిమ్మాపురంలో ఆయన విర్డ్స్ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. జిల్లాలో 17వేల ఎకరాల అటవీ భూమి ఉందని చెప్పారు. అటవీ భూములను డీనోటిఫై చేసి పరిశ్రమలను తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. భీమవరంలో అక్వా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు.

Chandrababu says he will fulfill promises

మంచి పనులకు అడ్డుపడటమే ప్రతిపక్షం పనిగా పెట్టుకుందన్నారు. ద్వారకా తిరుమల వద్ద 17వేల ఎకరాల అటవీ భూమి ఉందని, దానిని డీనోటిఫై చేసి పరిశ్రమలు నెలకొల్పుతామని చెప్పారు. రైతులు, పేదలు సంతోషంగా ఉండాలనేదే తన తాపత్రయం అన్నారు.

Chandrababu says he will fulfill promises

డ్వాక్రా సంఘాలకు రూ.10వేల కోట్ల పెట్టుబడి నిధి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ద్వారకా తిరుమలను హెల్త్ హబ్‌గా మార్చాల్సి ఉందన్నారు. గోపాలపురంలో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ద్వారకా తిరుమలలో నిత్య అన్నదానం ఉంటుందన్నారు.

Chandrababu says he will fulfill promises

కాపులకు హామీ ఇచ్చాం నెరవేర్చుకుంటాం

కాపులకు తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానని చెప్పారు. కాపులను బిసిలలో చేర్చుతామన్న హామీకి కట్టుబడి ఉన్నానని చెప్పారు. వెనుకబడి ఉన్నకాపులను పూర్తిగా ఆదుకుంటామని ఆయన చెప్పారు. కాగా, గత సార్వత్రిక ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఎక్కువగా టిడిపి వెంట నడిచింది. అందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కారణం అని చెప్పవచ్చు.

Chandrababu says he will fulfill promises

ఏపీలో జోనల్ వ్యవస్థను కొనసాగించాలి: శ్రీకాంత్ రెడ్డి

ఏపీలో జోనల్ వ్యవస్థను కొనసాగించాలని వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. జీవో 120తో వెనుకబడిన ప్రాంత విద్యార్థులకు ఇబ్బంది అవుతుందన్నారు. జీవో 120ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రయివేటు వర్సిటీ బిల్లును ఆమోదించడం బాధాకరం అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+