మంత్రి మాణిక్యాలరావుకు క్షమాపణలు చెప్పిన చంద్రబాబు
దేవాదాయ శాఖామంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్షమాపణలు చెప్పారు.
విజయవాడ: దేవాదాయ శాఖామంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్షమాపణలు చెప్పారు. ఇటీవల మాణిక్యాలరావు తల్లి మృతి చెందారు. ఆమె మృతిపట్ల సానుభూతి వ్యక్తం చేసిన చంద్రబాబు మంత్రివర్గ సమావేశానికి హాజరైన మంత్రితో మాట్లాడారు.

ఆమె చనిపోయిన సమయంలో నేరుగా పరామర్శించలేకపోయానంటూ క్షమాపణలు చెప్పారు. బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయానని పేర్కొన్నారు. మరోమారు ఆయనకు సానుభూతి తెలిపారు.
కాగా, దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తల్లి రంగనాయకమ్మ(73) శనివారం(డిసెంబర్ 31న) విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందారు. మెదడుకు సంబంధించిన వ్యాధితో దీర్ఘకాలంగా ఆమె చికిత్స పొందుతున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. రంగనాయకమ్మ, సుబ్బారావుల ఏకైక కుమారుడు మంత్రి మాణిక్యాలరావు.












Click it and Unblock the Notifications