ఇక్కడే ఉండాలనిపిస్తుంది, కానీ...: బాబు
తెలుగువారి కోసం పుట్టిందే తెలుగుదేశం పార్టీ అని, కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడిన పార్టీ టీడీపీ అని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన టీడీపీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్నివర్గాల్లో రాజకీయ చైతన్యం తెచ్చింది టీడీపీయేనని అన్నారు.
బలహీనవర్గాలకు టీడీపీ ప్రాధాన్యతనిచ్చిందని, అధికారంలో ఉన్నా... లేకున్నా ప్రజల కోసం పోరాడతామని అన్నారు. రాష్ట్రంలో నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరముందని, అభిమానం చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోందని, కానీ ఏపీలో బాధ్యత గుర్తొచ్చినప్పుడు వెళ్లక తప్పదని చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications