వచ్చే ఎన్నికలు, కూటమి ఫ్యూచర్ పై తేల్చేసిన చంద్రబాబు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు హిందూస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సులో పాల్గొన్నారు. కేంద్రం, ఏపీలో ఎన్డీఏ కూటమి నాయకత్వంలో సాగుతున్న పాలన గురించి వివరించారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఎలా ఉండాలో తన అభిప్రాయాలను స్పష్టం చేసారు. ప్రధాని మోదీ నాయకత్వం.. ఆయన నిర్ణయాల పైన చంద్రబాబు తన అభిప్రాయాలను వెల్లడించారు.
మోదీనే మా లీడర్
సీఎం చంద్రబాబు బీజేపీ నాయకత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. నాడు వాజ్ పేయ్ బీజేపీకి పునాదులు వేస్తే.. నేడు మోదీ ఆ పార్టీని బలోపేతం చేసారని చెప్పుకొచ్చారు. మోదీ నాయకత్వంలో దేశం ఆర్దికంగా సుస్థిరత సాధించిందని చెప్పారు. ప్రపంచంలోనే భారత్ మడో స్థానంకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. నరేంద్ర మోడి తమ లీడర్ అని చంద్రబాబు స్పష్టం చేసారు. ఆయన ఆధ్వర్యంలో ముందుకు వెళ్తామని చెప్పారు. హర్యానా సీఎం ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రధాని ఆధ్వర్యంలో ఎన్డీయే కూటమి సీఎంల సమావేశం జరిగిందిలో 2029 ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం అవ్వాలనే విషయంపై మోడి అందరి అభిప్రాయాలు తీసుకున్నారని వెల్లడించారు.

కూటమి కొనసాగుతుంది
ఏపీలో కూడా 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి వచ్చిందని వివరించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పవన్ కళ్యాణ్ మూడు పార్టీలను కలిపారన్నారు. దాని ఫలితమే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయని ముందుగానే అంచనా వేసామని చంద్రబాబు పేర్కొన్నారు. కూటమిలో ఎటువంటి సమస్యలు లేవు, అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతామని..అదే విధంగా తమ కూటమి దీర్ఘకాలం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీలను ఉపయోగించి అన్ని రంగాల్లో పరిష్కారాలు వెతకొచ్చని పేర్కొన్నారు.
జానాభా నిర్వహణపై
చైనా, జపాన్ సహా అనేక ప్రపంచ దేశాల్లో వయోధికులు ఎక్కువైపోయారని చంద్రబాబు వివరించారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సమస్య ప్రారంభమైందని చెప్పారు. ఫెర్టిలిటీ రేటు తగ్గిపోతోందన్నారు. భారతదేశంలో 145 కోట్ల జనాభా ఉంది. పాపులేషన్ మేనేజ్మెంట్ చేస్తే ప్రపంచంలో మనల్ని కొట్టేవారే ఉండరని వివరించారు. ఉపాధి, ఉద్యోగ కల్పన జరగాలని... మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాల అభివృద్ధి జరగాలని అభిప్రాయపడ్డారు. అలాగే సోషల్ మీడియాలో విపరీత ధోరణులు కనిపిస్తున్నాయని.. వ్యక్తిత్వ హసనం జరుగుతోందని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications