బడ్జెట్ ఆశాజనకంగా లేదు; ఎంపీలు రాష్ట్రానికి ఏం సాధించారన్న టీడీపీ అధినేత చంద్రబాబు
2022- 23 సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ పై ప్రతిపక్ష పార్టీల నుండి తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. ఈ బడ్జెట్ నిరాశాజనకమైన బడ్జెట్ అని కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష పార్టీలు బిజెపి సర్కార్ ను టార్గెట్ చేస్తున్నాయి. 2022-23 కేంద్ర బడ్జెట్ సామాన్య మధ్యతరగతి ప్రజలకు నిరాశాజనకమైన బడ్జెట్ అని ప్రతిపక్షాల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువగా మారాయి.

బడ్జెట్ ఆశాజనకంగా లేదు అన్న చంద్రబాబు నాయుడు
తాజాగా ఈ బడ్జెట్ పై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ బడ్జెట్లో రైతులు పేదల కోసం ఏం చేస్తున్నారో చెప్పలేదని చంద్రబాబు పేర్కొన్నారు. వేతన జీవులకు బడ్జెట్ మొండిచేయి చూపింది అని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. నదుల అనుసంధానంపై కేంద్రం ప్రణాళికలు స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు చంద్రబాబు. అదేవిధంగా డిజిటల్, సోలార్, ఎలక్ట్రికల్, వెహికల్ రంగంలో సంస్కరణలు తీసుకు రావడం మంచి పరిణామమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇరవై ఎనిమిది మంది వైసీపీ ఎంపీలు రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలి
విద్యుత్ వాహనాలు ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన నూతన విధానం బాగుందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కేంద్ర బడ్జెట్ లో వైసీపీ సర్కార్ రాష్ట్ర ప్రయోజనాలు సాధించడంలో విఫలమైందని చంద్రబాబునాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి బడ్జెట్లో ఎలాంటి లాభం చేకూరలేదని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇరవై ఎనిమిది మంది వైసీపీ ఎంపీలు రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. జాతీయ ఆహార భద్రత పథకంలో కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేయడం మంచిది కాదని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.

నిత్యావసర వస్తువుల ధరలపై ఎలాంటి చర్యలు లేవు
కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న రంగాలకు ఎలాంటి చేయూతనిస్తున్నారు అనేది ఈ బడ్జెట్లో చెప్పలేదని చంద్రబాబు నాయుడు విమర్శించారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పేదలకు భారంగా మారాయని, అటువంటి పరిస్థితుల్లో ధరలు తగ్గించడం కోసం ఎటువంటి చర్యలు ప్రకటించకపోవడం సమంజసం కాదని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పంటలకు మద్దతు ధర కల్పించే విషయంలో ఎటువంటి సానుకూల నిర్ణయాలు లేకపోవడం బాధాకరమని చంద్రబాబు పేర్కొన్నారు.
Recommended Video

బడ్జెట్ పై విరుచుకుపడుతున్న ప్రతిపక్ష పార్టీల నేతలు
ట్విట్టర్ వేదికగా కేంద్ర బడ్జెట్ 2022 పై స్పందించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మోడీ గవర్నమెంట్ యొక్క జీరో సమ్ బడ్జెట్ ఇదని పేర్కొన్నారు. వేతన జీవులకు బడ్జెట్లో ప్రయోజనం లేదని, మధ్యతరగతి ప్రజలు , పేదలు,నిరుపేదలకు బడ్జెట్ ద్వారా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు అని, యువత, రైతులు, ఎంఎస్ఎంఈలకు ఏమీ లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్లో అందరికీ మొండి చెయ్యి చూపారని రాహుల్ గాంధీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం బడ్జెట్‌ను 'పెగాసస్ స్పిన్ బడ్జెట్' అని అభివర్ణించారు. బడ్జెట్‌లో సామాన్య ప్రజలకు చేకూరింది ఏదీ లేదని, 'సున్నా' అని పేర్కొన్నారు. నిరుద్యోగంతో మరియు ద్రవ్యోల్బణంతో నలిగిపోతున్న సామాన్య ప్రజలకు బడ్జెట్‌లో సున్నా మిగిలిందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications