కెసిఆర్ అపాయింట్‌మెంట్ కోరిన చంద్రబాబు: భేటీ ఖరారు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కలవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపాయింట్‌మెంట్ కోరారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంవో) అధికారులు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి అపాయింట్‌మెంట్ కోరారు.

రేపు ఆదివారం సాయంత్రం చంద్రబాబు కెసిఆర్‌ను కలవడానికి ఎపి సిఎంవో అధికారులు తెలంగాణ సిఎంవో అధికారులను అపాయింట్‌మెంట్ కోరారు. ఈ నెల 22వ తేదీన జరిగే అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా కెసిఆర్‌ను చంద్రబాబు కలవడానికి ఈ అపాయింట్‌మెంట్ కోరారు. చంద్రబాబు కెసిఆర్‌కు అమరావతి శంకుస్థాపన పత్రాన్ని అందించనున్నారు.

కెసిఆర్‌ను స్వయంగా కలిసి అమరావతి శంకుస్థాపనకు రావాలని కోరుతానని చంద్రబాబు ఇది వరకే చెప్పారు. చెప్పినట్లుగానే ఆయన రేపు కెసిఆర్‌ను కలవడానికి సిద్ధపడ్డారు. వీరిద్దరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇరువురు ముఖ్యమంత్రుల భేటీ ఖరారైంది. రేపు ఆదివారం సాయంత్రం ఐదు గంటల తర్వాత కెసిఆర్‌ను చంద్రబాబు కలవనున్నారు. అలాగే, గవర్నర్ నరసింహన్‌ను కూడా రేపే చంద్రబాబు కలిసి అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రాన్ని అందించనున్నారు.

 Chandrababu seeks KCR appointment to extend invitation to Amaravati

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం పలు కార్యక్రమవాల్లో పాల్గొననున్నారు. నేటి షెడ్యూల్‌ ప్రకారం కాసేపట్లో స్మార్ట్‌ విలేజ్‌-స్మార్ట్‌ వార్డుపై జరుగనున్న వర్క్‌షాప్‌కు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు గేట్‌వేలో వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే సాయంత్రం 6.30కి గనులశాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. సాయంత్రం 7.30 క్యాపిటల్‌ కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+