కాంగ్రెసుతో కుమ్మక్కు: జగన్‌ బెయిల్‌పై చంద్రబాబు

న్యూఢిల్లీ: రాజకీయ మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగంగానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కోర్టులో బెయిల్ మంజురైందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆయన సోమవారం సాయంత్రం ఢిల్లీలో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సిబిఐ కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్‌గా మారిందని వ్యాఖ్యానించారు

జగన్ డిఎన్ఎ, కాంగ్రెసు డిఎన్ఎ ఒక్కటేనని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ గతంలో చెప్పారని ఆయన గుర్తు చేశారు. జగన్ ఆస్తుల కేసును నీరు గార్చేందుకు కాంగ్రెసు ప్రయత్నించిందని ఆయన అన్నారు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని విలీనం చేసుకోవాలని కాంగ్రెసు ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ఓట్లు సీట్లు కావాలి, ఎవరు ఏమైనా ఫర్వాలేదనే పద్ధతిలో కాంగర్ెసు వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.

Nara Chandrababu Naidu

వైయస్ జగన్‌కు సంబంధించి కొన్ని కేసుల్లో క్విడ్ ప్రోకో లేదని సిబిఐ హడావిడిగా చెప్పిందని, కాంగ్రెసు- వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను ప్రజల ముందు దోషులుగా నిలబెడుతామని చంద్రబాబు అన్నారు. వైయస్ జగన్ కేసులో ఇప్పటి వరకు ఈడి విచారణ జరగకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. ఎ2, ఎ4 బయటకు రాలేని స్థితిలో ఎ1గా ఉన్న జగన్ ఎలా బయటకు వస్తారని ఆయన అడిగారు. జగన్ కేసులో సాధారణ స్థాయిలో పెట్టాల్సిన న్యాయవాదులను కూడా సిబిఐ పెట్టలేదని ఆయన అన్నారు. చార్జిషీట్లు దాఖలు చేయకముందే జగన్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారని ఆయన అన్నారు.

వైయస్ జదగన్ బరి తెగించి, అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. కర్ణాటక మాజీ మంత్రి రెండేళ్లుగా జైలులో ఉన్నారని, సత్యం రామలింగరాజు ఆస్తులను జప్తు చేశారని, రామలింగ రాజు నాలుగేళ్ల పాటు జైలులో ఉన్నారని ఆయన గుర్తు చేశారు. కోల్‌కతా కంపెనీలు జగన్ కంపెనీల్లో అక్రమంగా పెట్టుబడులు పెడితే ఈడి ఏం చేస్తోందని ఆయన అడిగారు. 16 నెలల పాటు ఈడి ఏ విధమైన చర్యలూ తీసుకోలేదని ఆయన అన్నారు. ఈడి, సిబిఐల ఉదాసీనతలపై పోరాటం చేస్తామని చెప్పారు.

రాష్ట్రంలోని పరిస్థితులను చెప్పాలని తాను భావిస్తే జాతీయ భద్రతా మండలి (ఎన్ఐసి) సమావేశంలో తనకు మైక్ ఇవ్వలేదని ఆయన చెప్పారు. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కాంగ్రెసు పార్టీ పురమాయించి పరిస్థితులను దిగజారుస్తోందని ఆయన విమర్శించారు. సిడబ్ల్యుసి తీర్మానం చేయడానికి ముందే సమాచారం ఇచ్చి వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యులతో కాంగ్రెసు రాజీనామాలు చేయించిందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+