Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లాయర్ల తప్పుల వల్లే చంద్రబాబు జైలుకు ? సీబీఐ మాజీ డెరెక్టర్ ట్వీట్- తీర్పులో లోపమిదే..

ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును తాజాగా అరెస్టు చేసిన సీఐడీ.. విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు రిమాండ్ కు పంపుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వెనుక రెండు సెక్షన్లు కీలక పాత్ర పోషించాయి. వీటిపైనే ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఈ సెక్షన్ల అన్వయింపు విషయంలోనూ న్యాయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు కూడా ట్వీట్ చేశారు.

చంద్రబాబును రిమాండ్ కు పంపాలని సీఐడీ చేసిన విజ్ఞప్తిని విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమబిందు ఆమోదించారు. దీంతో చంద్రబాబును రెండు వారాల పాటు రిమాండ్ కు పంపుతూ తీర్పు ఇచ్చారు. అయితే కోర్టులో విచారణ సందర్భంగా ఇందులో సీఆర్పీసీలోని రెండు కీలక సెక్షన్లపై తీవ్ర వాదోపవాదాలు సాగాయి. ఇందులో ఒకటి సెక్షన్ 409 కాగా.. మరొకటి సెక్షన్ 17ఏ. సెక్షన్ 490లో ఆస్తి బదలాయింపుకు సంబంధించి, లేదా నిధుల బదలాయింపుకు సంబంధించింది కాదా మరో సెక్షన్ 17ఏ అవినీతి కేసుల్లో గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు చేయొచ్చా లేదా అన్నది.

chandrababu sent to jail with his lawyers mistakes-former cbi director nageswararao tweet

అయితే ఈ రెండు సెక్షన్లనూ చంద్రబాబుకు అన్వయిస్తూ సీఐడీ ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ను ఏసీబీ కోర్టు ఆమోదించింది. ఇందులో సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి తీసుకోవాలన్న నిబంధనను చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా తెరపైకి తెచ్చారు. అయితే సీఐడీ మాత్రం అక్కర్లేదని వాదించింది. ఇందుకు గతంలో అచ్చెన్నాయుడు కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. అయితే ఏసీబీ కోర్టు తీర్పులో మాత్రం సుప్రీంకోర్టు గతంలో ఈ తీర్పు ఇచ్చినట్లు రాసినట్లు తెలుస్తోంది. దీనిపై సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు స్పందించారు.

చంద్రబాబు కేసులో సెక్షన్ 17ఏను తప్పుగా అన్వయించినట్లు కనిపిస్తోందని సీబీఐ మాజీ డెరెక్టర్ నాగేశ్వరరావు ట్వీట్ చేశారు. ఇందులో తాజాగా ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు కాపీతో పాటు గతంలో అచ్చెన్నాయుడు కేసులో హైకోర్టు తీర్పు, రాఫెల్ కేసులో యశ్వంత్ సిన్హా విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని ప్రస్తావించారు. అచ్చెన్నాయుడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు భావించి ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించినట్లుందన్నారు. కానీ అచ్చెన్నాయుడు కేసు తీర్పు ఇచ్చింది హైకోర్టు అని, కానీ రాఫెల్ కేసులో సుప్రీంకోర్టు.. సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరి అని చెప్పిందన్నారు.

అలాగే మరో ట్వీట్ లో నాన్-బెయిలబుల్ నేరంలో ఎవరైనా వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినప్పుడు, న్యాయవాదులు చేసే మొదటి పని సంబంధిత కోర్టు ముందు బెయిల్ కోసం దరఖాస్తు చేయడమేనన్నారు. పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ దరఖాస్తును, అరెస్టయిన వ్యక్తి కలిసి దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తును కోర్టు విచారిస్తుందన్నారు. అరెస్టు చేసిన వ్యక్తిని పోలీసు లేదా జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేయడం లేదా బెయిల్ మంజూరు చేయడం వంటి తగిన ఉత్తర్వులను జారీ చేస్తుందన్నారు. కానీ చంద్రబాబు లాయర్లు ఆ పని చేయకుండా రిమాండ్ ను వ్యతిరేకించడానికే పరిమితమయ్యారన్నారు. అందుకే చంద్రబాబు జైలుకెళ్లారన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+