అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతిలో ఆలస్యంపై బాబు సీరియస్, తెలంగాణ మిగులు.. ఏపీకి అప్పుగా: టీజీ

|
Google Oneindia TeluguNews

విజయవాడ: అమరావతి నిర్మాణం పనుల్లో ఆలస్యం పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈ రోజు అమరావతి నిర్మాణం పైన సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ డిజైన్ల పైన సమీక్షలో చర్చించారు.

రివర్స్, టిడిపిలో ఆందోళన: చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ చెక్, జగన్ సేఫ్! రివర్స్, టిడిపిలో ఆందోళన: చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ చెక్, జగన్ సేఫ్!

నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందని తెలుసుకొని మండిపడ్డారు. డిసెంబర్ నాటికి పూర్తి కావాల్సిన సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు ఇంకా కొలిక్కి రాకపోవడంపై అధికారులను నిలదీశారు. ఏడు రోడ్లకు పారదర్శకంగా టెండర్లు పిలవాలను సూచించారు.

Chandrababu serious over Amaravati works delay

విభజన వల్లే తెలంగాణకు మిగులు బడ్జెట్: టిజి వెంకటేష్

రాష్ట్ర విభజన వల్లనే తెలంగాణకు మిగులు బడ్జెట్ ఉందని, ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్‌లో ఉందని తెలుగుదేశం పార్టీ ఎంపీ టిజి వెంకటేష్ మంగళవారం అన్నారు. మిగులు బడ్జెట్‌ను ఏపీకి అప్పుగా ఇవ్వాలని చెప్పారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీలు పూర్తిగా ఇచ్చే వరకు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగానే ఉంచాలన్నారు.

శ్రీవారి సేవలో గంటా

తిరుమల శ్రీవారిని మంత్రి గంటా శ్రీనివాస రావు, ఎంపీ సీఎం రమేష్‌లు బుధవారం ఉదయం దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందించారు. మండలి విపక్ష నేత సీ రామచంద్రయ్య విఐపి విరామ సమయంలో స్వామి వారి దర్శనం చేసుకున్నారు.

English summary
AP CM Chandrababu Naidu serious over Amaravati works delay.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X