జగన్.. తోక కట్ చేస్తా జాగ్రత్తా : చంద్రబాబు వార్నింగ్

ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం ముదురుతోంది. ప్రత్యేక హోదా విషయంలో తప్పు మీదంటే మీదని దుమ్మెత్తి పోసుకుంటున్నాయి ఇరు పక్షాలు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు వ్యవహార శైలి సిగ్గుచేటు విషయమని వైసీపీ ఆరోపిస్తోంటే.. తోక జాడిస్తే కట్ చేస్తా అంటూ ప్రతిపక్షానికి వార్నింగ్ ఇస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

శుక్రవారం విజయవాడ పరిధిలో జరిగిన నీరు చెట్టు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసుకుని పలు విమర్శలు గుప్పించారు. ఏపీకి వెన్నుపోటు పొడిచానని పనిగట్టుకుని కొన్ని పత్రికల్లో తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఫోటోలతో సహా తనపై దుష్ప్రచారం చేయడాన్ని ఇక ఏ మాత్రం ఉపేక్షించేది లేదన్నారు.

chandrababu serious warning to jagan

తన సూచనలను బేఖాతరు చేసి రాష్ట్ర విభజనకు పాల్పడ్డారని, ఇష్టానుసారంగా విభజించేసి యుద్ద విమానంలో విభజన బిల్లును తీసుకొచ్చారన్నారు. ఇరు రాష్ట్రాల పెద్దలు కలిసి కూర్చోని విభజనపై నిర్ణయం చేయాలని సూచిస్తే తనను లెక్క చేయలేదన్నారు. పార్లమెంటు తలుపులు మూసేసి విభజన చేశారని ఆరోపించిన మోడీ.. వీటన్నింటిని ద్రుష్టిలో పెట్టుకుని మరింత పట్టుదలతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఇక వైసీపీ అధినేత జగన్ పై విరుచుకుపడ్డ చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రతి పనికి అడ్డు తగులుతున్నారని వైసీపీని దుయ్యబట్టారు. వట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులతో సహా ఆఖరికి అమరావతి నిర్మాణానికి కూడా అడ్డు తగలడం దారుణమన్నారు. కాపుల ఉద్యమం ఉద్రిక్తలకు దారితీయడానికి కారణం కూడా వైసీపీయే అని ఆరోపించిన చంద్రబాబు, ఎవరైనా సరే తోక జాడించాలని చూస్తే కట్ చేస్తానంటూ హెచ్చరించారు. మొత్తానికి విమర్శల విషయంలో ఇరు పార్టీలు పోటాపోటీగా మాటల తూటాలను పేల్చడం ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+