ఆ కిటుకేంటో చెప్పాలి, నారాయణని అరెస్ట్ చేయరేం: బాబుకు రోజా, నేర్చుకుందాం: జగన్
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించే కిటుకు ఏమిటో చెప్పాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా శుక్రవారం నాడు ప్రశ్నించారు. తాము పాలు, కూరగాయలు అమ్మి జీవిస్తున్నామని టిడిపి యువనేత నారా లోకేష్ చెప్పారని గుర్తు చేశారు.
పాలు, కూరగాయలతో కోట్లు సంపాదించే కిటుకు ఏమిటో చంద్రబాబు చెప్పాలన్నారు. హెరిటేజ్‌కు పాలు అమ్మిన రైతులు ఎందుకు కోటీశ్వరులు కావడం లేదో చెప్పాలన్నారు. చంద్రబాబు చేసిన మోసంతో ఏపీలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు.
నారాయణను అరెస్టు చేయడం లేదేం

మంత్రి పీ నారాయణను ఎందుకు అరెస్టు చేయడం లేదని రోజా ప్రశ్నించారు. నారాయణ కళాశాల విద్యార్థుల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులైన యాజమాన్యాల పైన కేసు పెడతామని మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారని, మరి మంత్రి నారాయణ పైన ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. నారాయణ కళాశాలల కోసం ప్రభుత్వం ప్రత్యేక జీవో ఏదైనా ఇచ్చిందా అని నిలదీశారు.
జగన్ ట్వీట్స్
జాతిపిత మహాత్మా గాంధీ 146వ జయంతిని పురస్కరించుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ జాతిపితకు లోటస్ పాండులో ఘనంగా నివాళి అర్పించారు. గాంధీజీతో పాటు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి కూడా నివాళులు అర్పించారు.
Let us all learn from the great visionary to be truthful in thought, word and deed pic.twitter.com/AGHiDmLIrt
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2015 Let us all pay homage to the simple man with an exemplary lifestyle.
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2015 అంతకుముందు గాంధీ జయంతిని పురస్కరించుకుని జగన్ ఓ సందేశాన్ని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఆలోచనలు, మాటలు, చేతల్లో నిజాయతీగా ఉండటాన్ని మనమంతా బాపూజీ నుంచి నేర్చుకుందామని ఆ సందేశంలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications