సింగపూర్‌కు బాబు ఫ్యామిలీ, డెహ్రాడున్‌కి జగన్ ఫ్యామిలీ
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు ముగియడం, ఎన్నికల ఫలితాలకు మరో వారం రోజుల గడువు ఉండటంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా విహారయాత్రకు వెళ్లనున్నారు.
గత మూడు నెలలుగా రాష్ట్రంలోని తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో ఎన్నికల కసరత్తు, ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు తన కుటుంబంతో కలిసి విశ్రాంతి కోసం అమెరికా వెళ్తున్నారు.

గురువారం రాత్రి ఎనిమిది గంటలకు హైదరాబాదు నుండి బయలుదేరి వెళ్తున్న ఆయన ఈ నెల 13వ తేదీన తిరిగి రానున్నారు. పొరుగున ఉన్న సింగపూర్ లేదా మాలెకు ఆయన వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆయనతోపాటు భార్య భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, కోడలు బ్రహ్మణి కూడా వెళ్తున్నారు.
ఎన్నికల తతంగం ముగియడంతో కుటుంబ సభ్యులతో కలసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి డెహ్రాడూన్ వెళ్తున్నారు. ఐదు రోజుల పాటు అక్కడ విశ్రాంతి తీసుకోనున్నారు. ఇప్పటికే డెహ్రాడూన్ వెళ్లడానికి ఆయన కోర్టు అనుమతి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications