కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడపలో జగన్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు-సొంత చెల్లికే మోసం-సీబీఐపై బాంబులా ?

|
Google Oneindia TeluguNews

వైసీపీ సర్కార్ ఛార్జీల పెంపుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఇవాళ కడప జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కడపలో చంద్రబాబు వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.

 బాదుడే బాదుడులో చంద్రబాబు

బాదుడే బాదుడులో చంద్రబాబు

బాదుడే బాదుడు ప్రతి ఇంటికి చేరిందని, కడప లో ఉత్సహం రెట్టింపు అయిందని చంద్రబాబు తెలిపారు. ప్రజల నాడి చూస్తే జగన్ పై తీవ్రమైన వ్యతిరేకత ఉందని తెలుస్తోందన్నారు. మూడు సంవత్సరాల్లో జగన్ అరాచకాలు అంతా ఇంత కాదని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు కూడా బాదుడే బాదుడు కొనసాగుతోందన్నారు. జగన్ పాలనలో వీర బాదుడు చెస్తున్నాడని బాబు విమర్సించారు.

 మహానాడుకు అడ్డంకులా ?

మహానాడుకు అడ్డంకులా ?

పటిష్టమైన యంత్రాంగం ఉన్న పార్టీ టీడీపీని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు తెలుగుజాతి పండుగ రోజని తెలిపారు. జగన్ సభ ప్రాంగణానికి స్టేడియం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసులను అడ్డుపెట్టి కేసులు పెడుతున్నారన్నారు. శ్రీలంక లో రాజపక్సేని ప్రజలు తరిమి కొట్టారని గుర్తుచేశారు.
ఏపీ లో కూడా జగన్ కు అలాంటి పరిస్థితి వస్తుందన్నారు. జగన్ ప్రతిపక్షం లో ఉన్నప్పుడు తాను అడ్డంకులు కలిగించి ఉంటే ఇడుపులపాయ నుంచి బయటికి వచ్చే వాడు కాదన్నారు. నియంతలు అందరూ కాలగర్భం లో కలిసిపోయారని చంద్రబాబు గుర్తుచేశారు.

 జగన్ పాలనలో అభివృద్ధి శూన్యం

జగన్ పాలనలో అభివృద్ధి శూన్యం

వైసీపీ హయాంలో అభివృద్ధికి ఒక్కరూపాయి కూడా ఖర్చు పెట్టలేదని చంద్రబాబు ఆరోపించారు. జగన్ సీఎం అయ్యాక కడపతో పాటు రాష్ట్రంలో భూకబ్జాలు పెరిగిపోయాయన్నారు. దీపం పథకం కింద వంటగ్యాస్ లు ఇస్తే జగన్ సీఎం అయ్యాక దీపం ఆర్పేశాడని చంద్రబాబు ఆరోపించారు. ప్రజలు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కార్యకర్తలు వారికి అండగా నిలబడాలని సూచించారు. జగన్ కు సిగ్గు లేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమన్నారు. నిన్న కర్నూల్ లో సోలార్ పార్క్ కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారని, గతంలో తాను సీఎంగా ఉండగా ఓసారి శంకుస్థాపన చేస్తే దాన్ని మళ్ళీ ప్రారంభించారని ఆక్షేపించారు. 3 సంవత్సరాల్లో సోలార్ ప్రాజెక్టు పూర్తి చేసుంటే ఇప్పుడు కరెంట్ కష్టాలు ఉండేవి కాదన్నారు. దేశంలో ఎక్కడా లేని పెట్రోల్ , కరెంటు ధరలు ఇక్కడ ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ట్యాక్స్ వేస్తూ బాదుడే బాదుడు చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలందరినీ ఒకటి చేయాల్సిన బాధ్యత కార్యకర్తల పై ఉందన్నారు.

 అప్పుల పాలన

అప్పుల పాలన

రాష్ట్రంలో ఇప్పటికే 8 లక్షల కోట్లు అప్పులు చేసిన ఘనత సీఎం జగన్ ది అని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రానికి అప్పులు ఇవ్వడానికి కేంద్రం కూడా వెనకడుగు వేసిందన్నారు. తండ్రిని అడ్డుపెట్టుకుని 43 వేల కోట్లు అవినీతి చేసిన జగన్...పాదయాత్రలో ముద్దులు పెట్టుకుంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు ప్రజలకు గుద్దులే గుద్దులు ఇస్తున్నాడన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తే దానికి మళ్ళీ జగన్ శంకుస్థాపన చేశారన్నారు. స్టీల్ ప్లాంట్ ను పూర్తి చేయలేని జగన్ అన్న చంద్రబాబు.. ఆయన కేవలం స్టిక్కర్ ముఖ్యమంత్రి అన్నారు. రాయలసీమ రాళ్ళ సీమగా మారకూడదని అప్పట్లో ఎన్టీఆర్ తెలుగు గంగ ప్రాజెక్టు తెచ్చారని, రాయలసీమ సస్యశ్యామలం గా ఉండాలని ఎన్నో ప్రాజెక్టులు తెచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. గండికోట లో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇంతవరకు సీఎం జగన్ ఇవ్వలేదన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెరు పెట్టి ఉన్న ప్రాజెక్టులు పోగొట్టే పరిస్థితి ప్రస్తుతం ఉందన్నారు.

 అబద్ధాల జగన్

అబద్ధాల జగన్

పోలవరం ఇప్పుడు ఎత్తిపోయిందని, జగన్ ఆబద్దాలు చెప్పడంలో దిట్ట అని చంద్రబాబు అన్నారు. జగన్ సొంత చిన్నాన్న హత్య ను ఆత్మహత్య గా చిత్రీకరించారని, జగన్ ఊరూరూ వెళ్లి రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు.

సొంత చెల్లినే మోసం చేసిన ఘనత జగన్ ది అని చంద్రబాబు విమర్శించారు. సీబీఐ డ్రైవర్ ను కూడా కొంత మంది చంపుతామని బెదిరించారని, పోలీసులను చూస్తే జాలేస్తుందన్నారు. సీబీఐపైనే బాంబులు వేస్తే మీ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదన్నారు. రౌడీల రాజ్యంలో పోలీసులు నిరసించిపోయాని చంద్రబాబు విమర్శించారు. పోలీసులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి జగన్ ప్రభుత్వం ది అన్నారు. పోలీసులు టిడిపి కార్యకర్తలని ఇబ్బందిపెట్టడం సరికాదన్నారు. ప్రజల్లో చాలా ఆవేదన బాధ ఉందని, జగన్ ఊరికి ఒకరిని సైకో ను తయారు చేసాడని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సైకోలందరికి చరమ గీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. పక్క రాష్ట్రానికి చెందిన వారికి రాజ్యసభ పదవులు ఇస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. పదవతరగతి పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని జగన్...నారాయణ, చైతన్య ల పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. పులివెందుల లో బస్టాండ్ కట్టలేని వాడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడంటే నమ్మలా అని ప్రశ్నించారు.

English summary
tdp chief chandrababu on today slams ys jagan and ysrcp govt in his kadapa tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X