మోదీ మెప్పు పొందడానికి ఆయన ఎదురుగా చంద్రబాబు ఏం చేశారో తెలుసా?
TDP Janasena BJP alliance: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ.. ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమికి తొలి బహిరంగ సభను నిర్వహిస్తోంది. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో ఈ సభ ఏర్పాటైంది. దీనికి ప్రజాగళం అని పేరు పెట్టారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. వేదికను పంచుకున్నారు. సుదీర్ఘ విరామం అనంతరం ఒకే వేదికపై ఈ ముగ్గురూ కనిపించారు. 2014 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా టీడీపీ- బీజేపీ కూటమి కట్టిన విషయం తెలిసిందే.

అప్పట్లో ఈ అలయన్స్‌కు మద్దతు ఇచ్చారు పవన్ కల్యాణ్. మోదీ, చంద్రబాబుతో కలిసి వేదికను పంచుకున్నారు. ఇప్పుడు మళ్లీ అలాంటి దృశ్యమే ప్రజా గళం సభా వేదికపై కనిపించింది. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ వేదికపైకి చేరుకోవడం పార్టీ క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపింది.
భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, టీడీపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, సీఎం రమేష్, వై సత్యకుమార్.. వంటి జనసేన, బీజేపీ నాయకులు వేదికపై ఆసీనులయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. ఆయన కొద్దిసేపు హిందీలో మాట్లాడారు. ప్రధాని మోదీకి అర్థం అయ్యేలా వివరించారు. ఆయనపై హిందీలో ప్రశంసల వర్షాన్ని కురిపించారు. మోదీ కోసం వికసిత భారత్‌ను సాధించాల్సిన అవసరం ఉందని, దాన్ని సాధించడానికి ఇదే సరైన సమయమని అన్నారు.

ఈ దేశానికి సరైన సమయంలో సమర్థుడైన, సరైన నాయకుడు లభించాడంటూ చంద్రబాబు పొగడ్తల్లో ముంచెత్తారు. తాము మోదీకి సంపూర్ణ మద్దతు ఇస్తోన్నామని, ఇది తమ వాగ్దానమని అన్నారు. భారత్‌ను అత్యంత శక్తిమంతమైన దేశంగా మోదీ తీర్చిదిద్దారని ప్రశంసించారు.
దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన జాతిగా తయారు చేయడం మోదీ ఆశయమని, భవిష్యత్తులో పేదరికం లేని భారత్‌ను తయారు చేసే శక్తి కూడా మోదీకి మాత్రమే ఉందని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో దూసుకెళ్తోందని, రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. వాటిని తమ కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications