బాబు షాక్! విమానాల్లో టూర్లకు రూ.15 కోట్ల ఖర్చు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమానయాన ఖర్చులు తడిసిమోపెడు అయ్యాయని సమాచారం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అనేక పర్యటనలకు ప్రత్యేక విమానాలను ఉపయోగించారు.

మరికొన్ని సందర్భాల్లో కొంతవరకు హెలికాప్టర్‌లో అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో కూడా పర్యటనలు నిర్వహించారు. దాదాపు 67 పర్యటనల సందర్భగా అయిన ఖర్చు ఏకంగా 15 కోట్ల రూపాయలు దాటిపోయిందని సమాచారం. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం, సివిల్ ఏవియేషన్ అధికారులు బిల్లులు తయారుచేసి ఆర్ధిక శాఖకు పంపించారు.

Chandrababu spent Rs.15 crores for Tours

ఇప్పటికే వివిధ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు పెరిగిపోతుండడంతో వారి నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి ఎక్కువవుతోందని ఆ శాఖల అధికారులు ఆర్ధిక శాఖకు వివరించినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 15 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు ఆర్ధిక శాఖ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కష్టాల్లో ఉందని చెబుతున్న చంద్రబాబు ఇలా విమానయాన ఖర్చుల కోసం ఇంతలా చేయడం సరికాదని విమర్శకులు అంటున్నారు. అయితే, అభివృద్ధి చర్యల్లో భాగంగా వెళ్లవలసి వచ్చిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+