విభజన బాంబు పెద్దది: చంద్రబాబు బైఠాయింపు
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పర్యటిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం తొండంగి మండలం, పెరుమాళ్ళపురంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రెండు రోజుల క్రితం వరదల పేరుతో వందల షాపులు తొలగించారని స్థానికులు ఆందోళన చేపట్టారు. వారికి మద్దతు తెలుపుతూ ఆయన బైఠాయింపు జరిపారు.
స్థానికుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ, వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ, స్థానికులతో కలిసి చంద్రబాబు ధర్నాకు దిగారు. అంతకు ముందు చంద్రబాబు జిల్లాలోని బుచ్చయ్యపేటలో మోకాళ్ల లోతు నీళ్ళలో నడిచి బాధితులను పరామర్శించారు.

రాష్ట్ర ప్రజలు వరద ముంపులో బాధలు పడుతుంటే హోంమంత్రి షిండే విభజనపై ప్రధాని టాస్క్‌ఫోర్స్ సమావేశాలు పెడుతున్నారని చంద్రబాబు ఈ సందర్భంగా దుయ్యబట్టారు.మొద్దు సీఎం కిరణ్ ఏసీల్లో సమీక్షలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. నష్ట పరిహారంపై తమ డిమాండ్ ఆచరణ సాధ్యమేనని, ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాకపోతే చెప్తే తాము చేస్తామని ఆయన అన్నారు.
రాష్ట్రంపై పడిన విభజన బాంబు పెద్దదని, వరదల కంటే విభజన గురించే ప్రజలు ఎక్కువగా బాధపడుతున్నారని ఆయన అన్నారు. ఇద్దరు కొడుకులను ఏతండ్రి, ఏ గ్రామ పెద్ద ఇంత మూర్ఖంగా విడదీయరని చంద్రబాబు నాయుడు విమర్శించారు.












Click it and Unblock the Notifications