వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ రెబల్స్ పై వేటు వేసిన చంద్రబాబు .. ఎవరెవరంటే

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని , అధికార పీఠం దక్కించుకోవాలని వైసీపీ విఫలయత్నాలు చేస్తుంటే తిరిగి అధికారంలోకి రావాలని టిడిపి ప్రయత్నిస్తోంది. ఇరు పార్టీల నుండి గెలుపు గుర్రాల నే రంగంలోకి దింపిన పార్టీల అధినేతలు ప్రచార పర్వాన్ని వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నారు. అయితే రెబల్స్ బెడద టీడీపీ కి ఇబ్బందికరంగా మారింది.

 టీడీపీ నుండి టికెట్ రానివారు రెబల్స్ గా పోటీ

టీడీపీ నుండి టికెట్ రానివారు రెబల్స్ గా పోటీ

ఏపీ ఎన్నికల్లో అధికార పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నుండి టికెట్ ఆశించి భంగపడ్డ వారు రెబల్స్ గా బరిలోకి దిగారు. ఇక వారిపై వేటు వేసిన చంద్రబాబుపార్టీ నుండి బహిష్కరించారు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశారు చంద్రబాబు. టిడిపి నుండి బరిలోకి దిగిన అభ్యర్థులు సైతం ప్రచారపర్వంలో ముందుకు వెళుతున్నారు. టికెట్ దక్కిన అభ్యర్థులంతా నామినేషన్లు వేసి.. తమ నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. అయితే.. టిక్కెట్ ఆశించి భంగపడిన వారిలో కొందరు ఇతర పార్టీ లోకి వెళ్లి ఆ పార్టీల నుండి బరిలోకి దిగారు.

రెబల్స్ వల్ల ఓటు బ్యాంకు చీలే అవకాశం

రెబల్స్ వల్ల ఓటు బ్యాంకు చీలే అవకాశం

ఇక ఏ పార్టీలోనూ చేరని కొందరు మాత్రం రెబల్స్ గా ఎన్నికల బరిలోకి దిగారు. అయితే.. ఈ రెబల్స్ కారణంగా సదరు నియోకవర్గాల్లో ఓటు బ్యాంకు చీలే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు రెబల్స్ పై సస్పెన్షన్ వేటు వేయాలని నిర్ణయం తీసుకున్నారు.
చంద్రబాబు నిర్ణయంతో టిడిపి పలువురు అభ్యర్థులను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

టీడీపీ లోనే ఎక్కువ రెబల్స్ బెడద ..

టీడీపీ లోనే ఎక్కువ రెబల్స్ బెడద ..

ఎన్నిక‌ల స‌మ‌యంలో అన్ని పార్టీల‌కు రెబ‌ల్స్ బెడ‌ద ఉండ‌టం స‌హ‌జం. అంద‌రికి టికెట్లు ఇవ్వ‌డం ఏపార్టీకి సాధ్యం కాదు. రెబ‌ల్స్‌ను బుజ్జ‌గించుకోవడం పార్టీ అధినేత‌ల బాధ్య‌త‌. వైసీపీకీ రెబ‌ల్స్ బెడ‌ద లేక‌పోయినా టీడీపీకీ మాత్రం వారి బెడ‌ద ఎక్కువ‌గా ఉంది. పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి ఓట్లకు రెబల్స్ గండి కొట్టే అవకాశం ఉంది అందుకే రెబల్స్‌ను బుజ్జ‌గించినా మాట వినని నేపధ్యంలోనే 9 మంది రెబల్స్ పై వేటు వేశారు. వారంద‌రినీ స‌స్పెండ్ చేశారు.

9 మంది రెబల్స్ పై వేటు .. సస్పెన్షన్ కు గురైన అభ్యర్థులు వీళ్ళే

9 మంది రెబల్స్ పై వేటు .. సస్పెన్షన్ కు గురైన అభ్యర్థులు వీళ్ళే

రంపచోడవరం నుండి రెబల్ గా బరిలోకి దిగిన కేపీఆర్‌కే ఫణీశ్వరి, గజపతినగరం నుండి బరిలోకి దిగిన కే శ్రీనివాసరావు, అవనిగడ్డ నుండి పోటీ చేస్తున్నకంఠమనేని రవిశంకర్‌, తంబళ్లపల్లె నుండి పోటీలో ఉన్న మాధవరెడ్డి, విశ్వనాథరెడ్డి, మదనపల్లె నుండి బరిలో ఉన్న బొమ్మనచెర్వు శ్రీరాములు, బద్వేలు నుండి పోటీ చేస్తున్న విజయజ్యోతి, కడప నుండి పోటీలో ఉన్న రాజగోపాల్‌రెడ్డి, తాడికొండ నుండి రెబల్ గా బరిలో ఉన్న శ్రీనివాసరావును టీడీపీ నుంచి సస్పెండ్ చేసి వారిపై వేటు వేసింది.
తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు టీడీపీ అధిష్టానం ప్రకటించింది

English summary
TDP suspended the following 9 rebel candidates.Rampachodavaram - K.P.R.K. Phaneeswari 2. Gajapathinagaram - K. Srinivasa Rao 3. Avanigadda - Kantamaneni Ravi Shankar 4. Thamballapalle - M. Madhava Reddy 5. Thamballapalle - N. Viswanadha Reddy 6. Madanapalle - Bommanacheruvu Sriramulu 7. Badvel - N. Vijaya Jyothi 8. Kadapa - A. Raja Gopal Reddy 9. Tadikonda - Sarva Srinivasarao
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X