వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పదవి తీసుకుంటారు కానీ: సొంత నేతలకు బాబు షాక్, ఆ నేతకు 'నంద్యాల' బంపరాఫర్

పార్టీ నేతలపై ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు మంగళవారం మండిపడ్డారు. టిడిపిలో పదవులు తీసుకున్న నేతలు పెదవి విప్పకపోవడం సరైన పద్ధతి కాదని ఆగ్రహించారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: పార్టీ నేతలపై ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం మండిపడ్డారు. టిడిపిలో పదవులు తీసుకున్న నేతలు పెదవి విప్పకపోవడం సరైన పద్ధతి కాదని ఆగ్రహించారు.

చదవండి: వైసిపిలో సగం వాళ్లే: జగన్‌కు 'లిక్కర్' షాక్, ఇంగ్లాండ్‌లోని బిగ్గెస్ట్ పోటీ కంటే...

పదవులు పొందిన వారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా ఇంచార్జి మంత్రులు ప్రజలతో మమేకం కావాలన్నారు. పనితీరు సామర్థ్యాన్ని బట్టి రాష్ట్ర, జిల్లా నియోజకవర్గాలలో నామినేటెడ్ పోస్టుల నియామకం ఉంటుందని చెప్పారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కోసం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటితో ఆయన భేటీ అయ్యారు.

సిఫార్సుతో పదవులు ఇవ్వను

సిఫార్సుతో పదవులు ఇవ్వను

భవిష్యత్తులో ఏ పదవి వచ్చినా అది ప్రతిభ ఆధారంగానే ఉంటుంది తప్ప, పైరవీలు, సిఫార్సులతో మాత్రం రాదన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి నలుగు సభ్యుల కమిటీ ఉంటుందని తెలిపారు. జిల్లా మంత్రితో పాటు ఎమ్మెల్యే, కార్యదర్శి, కార్య నిర్వాహక కార్యదర్శి ఉంటారన్నారు.

ఇదీ జగన్.. ప్రజలకు చెప్పండి

ఇదీ జగన్.. ప్రజలకు చెప్పండి

గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టామని చెప్పారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు అంశాలపై పదేపదే కేసులు వేసి అడ్డుకొనేందుకు ప్రయత్నించిన వైసిపి నేతలు.. అది నెరవేరకపోవడంతో కులాలలను రెచ్చగొట్టి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

త్వరలో పర్యటిస్తా

త్వరలో పర్యటిస్తా

త్వరలో తాను జిల్లాల్లో పర్యటిస్తానని చంద్రబాబు చెప్పారు. అందులో ఆదర్శ గ్రామాల సందర్శనతో పాటు రైతు, మహిళా సదస్సులు, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు. సెప్టెంబర్ 17 నుంచి ఇంటింటికి టిడిపి కార్యక్రమం ప్రారంభించాలన్నారు.

ఫరూక్‌కు బాబు బంపరాఫర్

ఫరూక్‌కు బాబు బంపరాఫర్

ఇదిలా ఉండగా, నంద్యాల ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టిడిపి ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. అలాగే, చంద్రబాబు పలువురు నేతలకు పదవులు కట్టబెట్టారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌కు చంద్రబాబు బంపరాఫర్ ఇచ్చారు. రాబోయే నంద్యాల ఉప ఎన్నికల్లో బాగా పని చేసి సీటు గెలిపిస్తే మండలి చైర్మన్‌గా చేస్తానని ఫరూక్‌కు హామీ ఇచ్చారు. అక్కడ టిడిపికి ముస్లీం మైనార్టీ ఓట్లు ఎన్ని పడ్డాయో కూడా చూస్తానని, దీనిని సవాల్‌గా తీసుకోమని చెప్పారు.

English summary
AP CM and TDP chief Nara Chandrababu Naidu took class to party leaders on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X