వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ తగలబెడతానంటే పర్మిషనా: జగన్‌పై బాబు, పవన్‌దీ తప్పే, విజయమ్మ ఓటమిపై..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి నిప్పులు చెరిగారు.

|
Google Oneindia TeluguNews

విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి నిప్పులు చెరిగారు. విశాఖ ఇమేజ్‌ను తగలబెడతానంటే అనుమతివ్వాలా అన్నారు. రిపబ్లిక్ డే రోజు ఎవరు ఆందోళనకు పిలుపునిచ్చినా తప్పే అన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ది కూడా తప్పే అన్నారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. జనసేన ఇప్పుడే ఏర్పడిందని, మిత్రపక్షమా, కాదా అనే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు.

<strong>హైడ్రామా: జగన్ పట్ల పోలీసుల దురుసు, సారీ చెప్పిన సీపీ, బలవంతంగా హైదరాబాద్</strong>హైడ్రామా: జగన్ పట్ల పోలీసుల దురుసు, సారీ చెప్పిన సీపీ, బలవంతంగా హైదరాబాద్

హుధుద్ తుఫాను వచ్చినప్పుడు ఎనిమిది రోజుల్లో పరిస్థితిని చక్కదిద్దామని చెప్పారు. తాను రెండేళ్లుగా చేసిన కృషి వల్లే విశాఖకు బ్రాండ్ ఇమేజ్ వచ్చిందన్నారు. దానిని కొందరు తగలబెట్టాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖలో రెండోసారి భాగస్వామ్య సదస్సు జరుగుతోందన్నారు. విశాఖ అబివృద్ధి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశామన్నారు. ఇప్పుడు విశాఖను చూసి గర్విస్తున్నానన్నారు. ఓ వైపు ఉగ్రవాదులు దేశంలో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

'పవన్ ప్రతీ ఉద్యమానికి ప్రభుత్వం స్పందిస్తోంది: జగన్ రాజకీయ ఉగ్రవాది' 'పవన్ ప్రతీ ఉద్యమానికి ప్రభుత్వం స్పందిస్తోంది: జగన్ రాజకీయ ఉగ్రవాది'

విపక్షాలు ఏ రోజు ప్రభుత్వాన్ని మెచ్చుకోలేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ఏడు ఏపీలో కలపాలని కేంద్రాన్ని కోరానని, అప్పటి దాకా తాను ప్రమాణం చేయనని చెప్పానని అన్నారు. తాము ఏం చేసినా విపక్షం రాజకీయం చేస్తోందన్నారు.

chandrababu naidu

పులివెందుల నుంచి రౌడీలు.. నేర నాయకత్వం

ఈ రోజు పులివెందుల నుంచి విశాఖకు రౌడీలను తీసుకు వచ్చారని ఆరోపించారు. ఆ రోజు హైదరాబాదును అభివృద్ధి చేశామన్నారు. ఇప్పుడు నేరాలు చేసిన వారు నాయకత్వం వహిస్తున్నారని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. లేదంటే వారు ఈ రోజు (రిపబ్లిక్ డే) విమానాశ్రయానికి వచ్చి హంగామా చేయరన్నారు.

<strong>'హెచ్చరిక.. జగన్ సహా ఎవరైనా..': త్యాగానికి సిద్ధం కానీ: మురళీ మోహన్</strong>'హెచ్చరిక.. జగన్ సహా ఎవరైనా..': త్యాగానికి సిద్ధం కానీ: మురళీ మోహన్

అందుకే వైయస్ విజయమ్మను గెలిపించలేదు

కావాలని ఆందోళనలు చేస్తున్నారన్నారు. రౌడీయిజం చేస్తారా అని నిలదీశారు. నేరాలు, ఘోరాలు జరుగుతాయనే వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైయస్ విజయమ్మను విశాఖ ప్రజలు గెలిపించలేదన్నారు. ఇలాంటి వాళ్లను నమ్ముకుంటే రాష్ట్రం ఏమవుతుందో యువత ఆలోచించాలన్నారు. ఉగ్రవాదులు దేశంలో అరాచకం సృష్టించాలని చూస్తున్నారన్నారు.

ప్రత్యేక హోదాపై..

ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలన్నింటిని తాము కేంద్రాన్ని కోరామని చంద్రబాబు చెప్పారు. 12వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాను నిరాకరించిందన్నారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు ఏపీకి అండగా ఉండాలని కోరామన్నారు. హోదాతో వచ్చే అన్ని ప్రయోజనాలు ఇవ్వాలని కేంద్రాన్ని అడిగామన్నారు. హోదాతో పారిశ్రామిక రాయితీలు లేవన్నారు. ఎక్కడున్నాయో ప్రతిపక్షాలు చూపించాలన్నారు.

<strong>సీఎంనే ఆపుతావా.. ఇక నేనే, గుర్తు పెట్టుకొని తాట తీస్తా: పోలీసులకు జగన్ వార్నింగ్</strong>సీఎంనే ఆపుతావా.. ఇక నేనే, గుర్తు పెట్టుకొని తాట తీస్తా: పోలీసులకు జగన్ వార్నింగ్

పులివెందులకు కూడా నీరు ఇస్తామంటే అడ్డుకున్నారన్నారు. కానీ తాము తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని చెప్పారు. ప్రజలకు ఒక్కటే చెప్పదలుచుకున్నానని, తనకు ఎలాంటి స్వార్థం లేదన్నారు. కుటుంబం కోసం కాదన్నారు. తనకు ఓటు వేసిన ప్రజలకు చేయాలనేది తమ తపన అన్నారు.

ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి..

ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి నా గురించి మాట్లాడటమా అన్నారు. తాను చెన్నా రెడ్డి నుంచి వైయస్ రాజశేఖర రెడ్డి వరకు పోరాడానన్నారు. ఓసారి వైయస్ తనకు క్షమాపణలు చెప్పాడన్నారు. జగన్ మాత్రం దారుణంగా మాట్లాడుతున్నారన్నారు. దావోస్‌కు వెళ్తే ఎగతాళి చేస్తున్నారన్నారు. పెట్టుబడుల కోసం అందరినీ బతిమాలుతున్నానని చెప్పారు.

బీచ్ రోడ్డులో రౌడీయిజం చేస్తామంటే ఎలా

బీచ్ రోడ్డులో కూర్చొని రౌడీయిజం చేస్తామంటే ఎలా అని నిలదీశారు. విపక్షాలు ఆందోళనలు చేస్తే పెట్టుబడులు పెట్టేందుకు భయపడతారన్నారు. పెట్టుబడులపై ప్రభావం చూపే అవకాశముందని చెప్పారు.

ప్రత్యేక హోదాకు, జల్లికట్టుకు సంబంధం లేదని చెప్పారు. ఎన్టీఆర్, తాను ఇన్నేళ్ల పాటు సీఎంగా ఉన్నామని, తమకు పేపర్, టీవీ ఆలోచన రాలేదని జగన్‌కు మాత్రం వచ్చిందన్నారు. విశాఖలో పులివెందుల రాజకీయం కుదరదన్నారు. తెలంగాణకు ఇంత ఆదాయం తన కృషే అన్నారు. పాముకు పాలు పోస్తే కాటు వేస్తుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

English summary
AP CM Chandrababu Naidu on Thursday lashed out at YS Jagan for his Vishaka tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X