కెసిఆర్ కుటుంబం జైల్లో ఉంటుంది: చంద్రబాబు

వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో గరీబోళ్ల పాలన కావాలా? గడీల పాలన కావాలో తేల్చుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు సూచించారు. తమకు ఓటేస్తే గరీబోళ్ల పాలన వస్తుందని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి ఓటు వేస్తే గడీల పాలన వస్తుందని ఆయన అన్నారు.. నీ బాంచన్ కాల్మొక్తా అనాల్సి వస్తుందని, గుమ్మాల దగ్గర కాపలా కాయాల్సి వస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ గుడిలో దెయ్యాన్ని కాదు.. దేవుడి బొమ్మ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిస్తే తెరాస అధినేత తెరాస అధినేత కె. చంద్రశేఖర రావు కుటుంబం జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుందని హెచ్చరించారు. బుధవారం వరంగల్ హన్మకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్‌లో జరిగిన 'ప్రజాగర్జన'లో ఆయన కెసిఆర్‌పై విరుచుకుపడ్డారు.

Chandrababu targets KCR at Warangal Praja Garjana

'దురంహకారి, మాటల మాంత్రికుడు, పూటకో మాట మార్చే మోసకారి' అంటూ కేసీఆర్‌పై దుమ్మెత్తిపోశారు.కెసిఆర్ మేస్త్రీ కాదు.. వసూల్ రాజా అని, అలాంటివాడు తాను కూలీగా పని చేస్తానంటే ఎవరు నమ్ముతారని చంద్రబాబు అన్నారు అన్నారు. కెసిఆర్‌కు దోచుకోవడం తప్ప మరొకటి తెలియదని అన్నారు. తెలంగాణ రాక ముందు కేసీఆర్ మొదట దళితుణ్ణి ముఖ్యమంత్రిగా, మైనారిటీలను ఉప ముఖ్యమంత్రిగా చేస్తానన్నారని, తీరా తెలంగాణ వచ్చిన తర్వాత మాట మార్చారనిస తానే ముఖ్యమంత్రి అయినట్టు కలలు కంటున్నారని ఆయన విమర్శించారు. అలాంటి నేతని నమ్మి ఓటు వేస్తే తెలంగాణలో భవిష్యత్తులో ఎప్పుడూ దళితులు, బడుగు బలహీన వర్గాల వారు ఆ పదవిని చేపట్టే అవకాశమే ఉండదని చెప్పారు.

తెలంగాణలో బీసీని తొలి ముఖ్యమంత్రిని చేసేది తమ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. అప్పటివరకూ తాను తెలంగాణ వదిలిపెట్టబోనని అన్నారు. ఒకసారి బీసీ ముఖ్యమంత్రి అయితే తర్వాత్తర్వాత దళితులకూ ఆ అవకాశం అందుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పార్లమెంటులో ఒక్క సీటు ఉన్న కేసీఆర్ వల్ల కాదు.. నాలుగు సీట్లు ఉన్న తమ పార్టీ వల్లనే సాధ్యమయిందని చంద్రబాబు అన్నారు.తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఒక్క తమ పార్టీకే ఉందని చెప్పారు.

ప్రధానికన్నా రోబో బెటర్

కాంగ్రెస్ దేశాన్ని బ్రష్టు పట్టిచ్చిందని, సర్వనాశనం చేసిందని చంద్రబాబు అన్నారు. ప్రధాన మంత్రి ఓ రోబో అని, రోబో సినిమాలో 'రజనీకాంత్' రోబో చురుగ్గా పని చేస్తుందని, ప్రధాని అలా కూడా కాదని, ఓ అసమర్థ రోబో.. అవినీతి రోబో అని ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+