నంద్యాల ఎంపీగా ఆ బీజేపీ మహిళా నేత ?చంద్రబాబు లెక్క ఇదే..!
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీలు టికెట్ల కసరత్తు ముమ్మరం చేస్తున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికల్లో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసిన రాయలసీమ ప్రాంతంలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇందులో భాగంగా రాయలసీమలో సీనియర్ రాజకీయ నాయకుడి కుమార్తెను నంద్యాల ఎంపీగా బరిలోకి దింపేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.

రాయలసీమలోని కీలకమైన నంద్యాల ఎంపీ సీటులో టీడీపీ ఈసారి బలమైన అభ్యర్ధి కోసం ఎదురుచూస్తోంది. అయితే స్ధానికంగా ఉన్న సమీకరణాల్లో అన్ని విధాలా తగిన అభ్యర్ధి మాత్రం దొరకడం లేదు. ఈ తరుణంలో తాజాగా పార్టీలో చేరిన రాజకీయ దిగ్గజం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె, బీజేపీ నేత బైరెడ్డి శబరిని రంగంలోకి దింపేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నారు. ఈ మేరకు బైరెడ్డికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో బైరెడ్డి వర్గీయులు సంబరాలు మొదలుపెట్టేశారు.

అదే సమయంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పాణ్యం సీటు నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దింపేందుకు కూడా చంద్రబాబు సిద్దమవుతున్నారు. దీంతో పాణ్యంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, నంద్యాల ఎంపీ బరిలో బైరెడ్డి శబరి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. రాయలసీమలో త్వరలోనే ఓ భారీ సభ నిర్వహించి శబరిని పార్టీలో చేర్చుకుని నంద్యాల ఎంపీ టికెట్ ఇస్తారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. రాయలసీమలో నీటి కోసం ఉద్యమాలు నడిపిన చరిత్ర ఉన్న బైరెడ్డిని, ఆయన కుటుంబాన్ని చేరదీయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications