చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆశించిన మెజారిటీ రావడం లేదు?: కుప్పం నేతలతో చంద్రబాబు రివ్యూ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో భాగంగా పార్టీ నేతలతో జరిపిన సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నిత్యం నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించడమే కాక తరచూ తాను అక్కడ పర్యటిస్తున్నా, ఆశించిన మెజారిటీ ఎందుకు రావడం లేదన్న విషయంపై ఆయన స్థానిక నేతలను ఆరా తీశారు.

పక్క రాష్ట్రమైన తమిళనాడు సీఎం, అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత గడప దాటకున్నా, ఆమె పోటీ చేసిన స్థానాల్లో ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కడంలేదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. తాను కుప్పానికి ఇంత చేస్తున్నా పరిస్థితిలో ఎందుకు మార్పు రావడం లేదని ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు.

స్థానిక నేతలు పార్టీ కార్యకర్తలను పట్టించుకోని ఫలితంగానే ఆశించిన మెజారిటీ రావడం లేదన్న వాదనపై ఏకీభవించిన ఆయన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండా మోసిన కార్యకర్తలను విస్మరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా ఆయన హెచ్చరించారు. ఇకనైనా నియోజకవర్గంలో పార్టీ పురోగతిపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.

చిత్తూరు జిల్లాలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజక వర్గంలో రెండురోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం చేరుకున్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు క్షణం తీరికలేకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

కుప్పం పర్యనటలో చంద్రబాబు

కుప్పం పర్యనటలో చంద్రబాబు

రాష్ట్ర విభజనతో ఏర్పడిన కష్టాలను ప్రధానికి వివరిస్తానని, రాష్ట్రాభివృద్ధికి సంపూర్ణ సహకారాన్ని అందించమని కోరుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మాజీ సర్పంచ్ మునికృష్ణయ్య గృహంలో దళితులతో కలసి సహఫంక్తి భోజనం చేశారు. అక్కడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కుప్పం పర్యనటలో చంద్రబాబు

కుప్పం పర్యనటలో చంద్రబాబు

అందరికీ పెన్షన్లు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. తన భర్త చనిపోయి 9నెలలు అవుతున్నా తనకు పెన్షన్ అందలేదని ఓ మహిళ సీఎంకు ఫిర్యాదు చేయగా, తనకు కూడా పెన్షన్ అందడంలేదని మరో వృద్ధురాలు కూడా సి ఎం కు తెలియజేశారు. అర్హులైన వారికి పెన్షన్లు అందించడంలో నిర్లక్ష్యం చేస్తే చూస్తూ ఊరుకోనని సీఎం ముఖాముఖి సభలోనే అధికారులను సున్నితంగా హెచ్చరించారు.

 కుప్పం పర్యనటలో చంద్రబాబు

కుప్పం పర్యనటలో చంద్రబాబు

ఇక అంతక ముందు జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. విభజన సమస్యలు వెంటాడుతున్నాయని అన్నారు. ఈపరిస్థితుల్లో గురువారం తాను ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలువనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న కష్టాలను వివరిస్తానని, అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారాన్ని అందించమని కోరుతానని స్పష్టం చేశారు.

 కుప్పం పర్యనటలో చంద్రబాబు

కుప్పం పర్యనటలో చంద్రబాబు

నదుల అనుసంధానమన్నది ఒక కలగా ఉందన్నారు. అయితే ఆ కలను నిజం చేసిన ఘనత దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్‌కు దక్కిందన్నారు. గోదావరి కృష్ణ నదుల అనుసంధానం చేయడం ఒక చారిత్రాత్మకమైన ఘట్టమన్నారు. రాష్ట్రాభివృద్ధికి గోదావరి నీరు అత్యవసర మన్నారు. జీవనది అయిన గోదావరి నీరు ఏడాదికి 3వేల టి ఎం సిల నీరు సముద్రం పాలవుతోందని చెప్పారు.

 కుప్పం పర్యనటలో చంద్రబాబు

కుప్పం పర్యనటలో చంద్రబాబు

కృష్ణానదిలో, శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో నీరులేదన్నారు. అందుకే గోదావరి, కృష్ణాను అనుసంధానం చేయాలన్నారు. తద్వారా ఆ నీటిని రాయలసీమ అవసరాలకు తీసుకువస్తామన్నారు. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును పొందుపరిచారని, అది జాతీయ ప్రాజెక్టని సి ఎం చెప్పారు. అయితే పోలవరం అభివృద్ధి చెందడానికి ఐదేళ్లు సమయం పడుతుందన్నారు.

 కుప్పం పర్యనటలో చంద్రబాబు

కుప్పం పర్యనటలో చంద్రబాబు

ఇప్పటికే 2500 గ్రామాల్లో నీటిని ట్యాంకుల ద్వారా సరఫరా చేయాల్సి వస్తోందని, ఇందుకు నెలకు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతోందన్నారు. పట్టణాల్లో అయితే మూడు,నాలుగు రోజులకొక్కసారి కూడా నీళ్లు అందివ్వలేని పరిస్థితి ఉందన్నారు. ఈ పరిస్థితులను ముందుగా పసిగట్టే పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టామన్నారు.

కుప్పం పర్యనటలో చంద్రబాబు

కుప్పం పర్యనటలో చంద్రబాబు

దివంగత ఎన్టీఆర్ నేతృత్వంలో తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవమైన మార్చి 29న పట్టిసీమకు శంకుస్థాపన చేశామన్నారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాజెక్టును జాతికి అంకితం చేశానన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో రాయలసీమకు నీళ్లు అందించేలా చర్యలు చేపడతామన్నారు.

 కుప్పం పర్యనటలో చంద్రబాబు

కుప్పం పర్యనటలో చంద్రబాబు

రైతులు సుఖసంతోషాలతో ఉండాలన్నదే తన ఆకాంక్షని, అందుకే వారికి రుణమాఫీ ప్రకటించామన్నారు. ఇందుకు 25వేల కోట్ల రూపాయలు అవుతున్నా తాను లెక్కచేయలేదన్నారు. డ్వాక్రా మహిళల సంక్షేమం కోసం 10వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టామన్నారు.

 కుప్పం పర్యనటలో చంద్రబాబు

కుప్పం పర్యనటలో చంద్రబాబు

ఒక్కొక్క మహిళకు 10వేల రూపాయలు చొప్పున గ్రూపులో పది మంది ఉంటే లక్ష రూపాయలు, 8 మంది ఉంటే 80వేల రూపాయలు ప్రకటించామన్నారు. ఇందుకు సంబంధించి తొలివిడతగా 3వేల రూపాయలు చెల్లించామన్నారు. మరో 7వేలు త్వరలోనే అందిస్తామన్నారు. అయితే ఇచ్చిన డబ్బును మహిళలు వృథా చేయకుండా మేకలు, కోళ్లు పెంపకంపై పెట్టుబడులు పెట్టి ఆదాయం పొందాలన్నారు. పొట్టేళ్లపైన నెలకు 4వేల రూపాయలు ఆదాయం సంపాదించవచ్చని, కోళ్లపైన నెలకు 2వేలు ఆదాయం పొందవచ్చన్నారు.

కుప్పం పర్యనటలో చంద్రబాబు

కుప్పం పర్యనటలో చంద్రబాబు

ఇక పేదలకు ఆహార భద్రత కల్పించడానికి కూడాచర్యలు చేపట్టామని సి ఎం తెలిపారు. గతంలో ఒక కుటుంబానికి 20 కేజీలు మాత్రమే బియ్యం ఇచ్చేవారన్నారు. అయితే ఇప్పుడు ఒక్కొరికి 5కేజీలు చొప్పున రేషన్‌షాపుల ద్వారా బియ్యాన్ని అందిస్తున్నామన్నారు. 8మంది ఉంటే 40కేజీలు అందిస్తున్నట్లు బాబు చెప్పారు.

 కుప్పం పర్యనటలో చంద్రబాబు

కుప్పం పర్యనటలో చంద్రబాబు

ఈ రేషన్ షాపుల ద్వారా అందించే ఈబియ్యంలో ఐదు గ్రాములు కూడా కొలతలు తక్కువరాకుండా కంప్యూటర్‌కు అనుసంధానం చేసి పారదర్శకతను పెంచినట్లు తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెం వేసే చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగానే కేజీ 40 రూపాయలున్న ఉల్లిని 20 రూపాయలకే అందించేలా చర్యలు చేపట్టామన్నారు. కందిపప్పు పంట దిగుబడి తగ్గి ధర పెరగడంతో బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసి సబ్సిడీ ధరకే రేషన్‌షాపుల ద్వారా అందిస్తున్నామన్నారు.

 కుప్పం పర్యనటలో చంద్రబాబు

కుప్పం పర్యనటలో చంద్రబాబు

పేదవారు కూడా సంపన్నులు ఉంటున్న గృహాల తరహాలో నివసించాని ఆకాంక్షించానని అన్నారు. అందుకే ఒక చదరపు అడుగుకు వెయ్యి రూపాయలు చొప్పున రెండు లక్షల 75వేల రూపాయలతో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు లక్షా 50వేల రూపాయలు సబ్సిడి ఇస్తే, నిరుపేదలకు లక్షా 20వేలు సబ్సిడి ఇచ్చామన్నారు.

 కుప్పం పర్యనటలో చంద్రబాబు

కుప్పం పర్యనటలో చంద్రబాబు

పశువులకు ఆహార భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు. కేవలం 4 రూపాయలకే గడ్డి,దాణా అందజేస్తున్నట్లు తెలిపారు. పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగానే కంప్యూటర్ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తూ పాల ఉత్పత్తిని పెంచుతున్నామన్నారు.

 కుప్పం పర్యనటలో చంద్రబాబు

కుప్పం పర్యనటలో చంద్రబాబు

అవాంతరాలను అధిగమించైనా పేదరికాన్ని నిర్మూలించడమే తమ లక్ష్యమన్నారు. పేదవారు, పేదవారిగానే ఉండాలని సంపన్నులు మరింత సంపన్నులు కావాలన్నదే వైకాపా నేతల లక్ష్యంగా కనిపిస్తోందని ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు విమర్శించారు.

ఆశించిన మెజారిటీ రావడం లేదు?: కుప్పం నేతలతో చంద్రబాబు రివ్యూ

ఆశించిన మెజారిటీ రావడం లేదు?: కుప్పం నేతలతో చంద్రబాబు రివ్యూ

ఆశించిన మెజారిటీ రావడం లేదు?: కుప్పం నేతలతో చంద్రబాబు రివ్యూ

ఆశించిన మెజారిటీ రావడం లేదు?: కుప్పం నేతలతో చంద్రబాబు రివ్యూ

ఆశించిన మెజారిటీ రావడం లేదు?: కుప్పం నేతలతో చంద్రబాబు రివ్యూ

ఆశించిన మెజారిటీ రావడం లేదు?: కుప్పం నేతలతో చంద్రబాబు రివ్యూ

English summary
Andhra Pradesh chief minister Chandrababu naidu on review Gudipalli Canal Works As Part Of Kuppam Tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X