చంద్రబాబు పేషీలో కీలక అధికారి నియామకం-రేపు డ్యూటీలోకి-ఈ ఐదు పైళ్లపై తొలి సంతకాలు..!
ఏపీలో ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులేస్తున్నారు. ఇందుకోసం ముందుగా తన పేషీని సిద్ధం చేసుకుంటున్నారు. ఇవాళ సీఎంగా ప్రమాణస్వీకారం తర్వాత తనకు ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం పోస్టింగ్ లేని రవిచంద్రను తన కార్యదర్శిగా చంద్రబాబు నియమించుకున్నారు.
అనంతరం చంద్రబాబు కేబినెట్ లో మంత్రులకు శాఖల కేటాయింపుపై కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల్ని పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ఈ సాయంత్రం మంత్రిత్వ శాఖలపై ప్రకటన రానుంది. అనంతరం చంద్రబాబు తిరుమల దర్శనానికి బయలుదేరి వెళ్లనున్నారు. ఐదేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తిరుమల దర్శనం చేసుకోనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రేపు ఉదయం ఆయన దర్శనం చేసుకుంటారు.

మరోవైపు రేపు సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నారు. రేపు సాయంత్రం 4.41 నిమిషాలకు సచివాలయంలోని ఫస్ట్ బ్లాక్ లో ఉన్న సీఎంవోలో ఆయన బాధ్యతలు చేపడతారు. అనంతరం ఐదు కీలక అంశాలపై సంతకాలు పెట్టబోతున్నారు. ఇందులో మొదటికి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై, రెండోది ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దుపై, మూడోది పెన్షన్ల పెంపుపై, నాలుగవ సంతకం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై, ఐదవ సంతకం స్కిల్ స్కైన్సెస్ ఫైలుపై చేయబోతున్నారు.












Click it and Unblock the Notifications