విజయవాడకు చంద్రబాబు షిఫ్ట్: ఈ నెల 9 నుంచి అక్కడే...
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నివాసాన్ని విజయవాడకు మార్చుకుంటున్నారు. ఈనెల 9 నుంచి కుటుంబంతో సహా ముఖ్యమంత్రి విజయవాడలో ఉంటారు. కృష్ణానదీ తీరంలోని లింగమనేని గెస్ట్‌హౌజ్‌లో భువనేశ్వరి ఇప్పటికే పూజలు చేశారు.
అదే అతిథిగృహాన్ని చంద్రబాబు నివాసంగా ఉపయోగించకుంటారు. ఇప్పటికే ఇంటికి కావాల్సిన ఫర్నీచర్‌ను ఇక్కడకు చేర్చారు. అందుకు అనుగుణంగా పలు ప్రభుత్వ కార్యాలయాలను కూడా విజయవాడకు తరలిస్తున్నారు. ప్రభుత్వ పరిపాలనా విభాగంలోని రెండు సక్షన్లను విజయవాడకు తరలించారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి సిబ్బందిని విజయవాడకు బదిలీ చేశారు. ప్రొటోకాల్ సెక్షన్‌లో సగం మందిని ఇప్పటికే బదిలీ చేశారు. రేపోమాపో మరికొందరిని కూడా హైదరాబాద్ నుంచి విజయవాడకు బదిలీ చేయబోతున్నారు.
ఈ మధ్య కాలంలో చంద్రబాబు ఎక్కువగా విజయవాడలోనే గడుపుతున్నారు. మంత్రివర్గ సమావేశాలను కూడా విజయవాడలోనే నిర్వహించారు. శాసనసభ సమావేశాలు ముగుస్తుండడంతో ఆయన కుటుంబంతో సహా విజయవాడకు మారాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications