ఏపీలో 75 లక్షల పేద కుటుంబాలకు గుడ్ న్యూస్-చంద్రబాబు కీలక ఆదేశాలు..!
ఏపీలో రెవెన్యూ శాఖపై ఇవాళ సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు (Chandrababu) పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిని అమల్లో పెట్టేందుకు డెడ్ లైన్లు కూడా ఇచ్చేశారు. వీటి అమలుతో రాష్ట్రంలో 75 లక్షల పేద కుటుంబాలకు లబ్ది కలుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భూ యాజమాన్యహక్కులకు సంబంధించిన అంశాలతో పాటు రైతుల పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి. వీటి అమలుకు చంద్రబాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
2027 మార్చి నాటికి భూములల రీసర్వే 2.0 ప్రక్రియ పూర్తి చేసి 1.12 కోట్ల పట్టా దారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అలాగే 1.37 లక్షల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22 ఏ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇతర సర్వీస్ ఇనాం లోని మరో లక్ష ఎకరాల భూములకూ విముక్తి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీని కోసం ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలని సీఎం సూచనలు చేశారు.

అలాగే 2016 కంటే ముందు ప్రభుత్వ హౌసింగ్ స్కీంలో పట్టా పొందిన ప్రతి ఇంటికీ రిజిస్ట్రేషన్ చేయించుకునే సౌలభ్యం కల్పించాలని నిర్ణయించారు. తద్వారా క్రయవిక్రయాలకు, గిఫ్ట్ డీడ్ లకు అవకాశం కలిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 75 లక్షల మంది పేద కుటుంబాలకు వరాలు ప్రకటిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఫ్రీ హోల్డ్ కింద అర్హత కలిగిన 9.25 లక్షల ఎకరాలపై భూ యజమానులకు త్వరలో పూర్తిగా యాజమాన్య హక్కులు కల్పించాలని నిర్ణయించారు. భూరికార్డులను బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో భద్రపర్చటంతో పాటు, ఆధార్, ఈ-కేవైసీ ద్వారా రికార్డ్ లాకింగ్ కు అవకాశం కల్పించాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications