పరుగులు పెట్టిస్తున్న సీఎం.. అసహనం, ఆగ్రహం: ఆమెకు రూ.2వేలిచ్చిన చంద్రబాబు

విశాఖ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను పరుగు పెట్టిస్తున్నారు. ఆయన విశాఖలో రెండో రోజు పర్యటిస్తున్నారు. హఠాత్తుగా తనిఖీలు చేస్తున్నారు.

విశాఖలో ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను సీఎం స్వయంగా పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అల్లీపురంలో మురుగు కాల్వ నిర్వహణ తీరు, నగరంలోని పార్కును పరిశీలించారు. సెవెన్ హిల్స్ ఆసుపత్రి పరిసరాలు, అబ్దుల్ కలాం పార్కును సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులపై ఆరా తీశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద చేపల మార్కెట్‌ను పరిశీలించారు. ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు, ఉన్నతాధికారులు సీఎం వెంట ఉన్నారు.

 Chandrababu tour in Vishaka on second day

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ యాచకురాలికి డబ్బులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన తన జేబులో నుంచి రూ.500 నోట్లు తీసి ఇచ్చారు. ఆ మొత్తం రూ.2వేలు. కాగా, వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించేందుకు ప్రజలు పోటీ పడ్డారు.

అమరావతిలో సైకిల్‌ ట్రాక్‌లు: నారాయణ

నూతన రాజధాని అమరావతిలో సైకిల్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఆదివారం ఉదయం గుంటూరులో 'ఐ రైడ్‌ విత్‌ ఇండియా' పేరిట సైకిల్‌ తొక్కడంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి పద్మజారాణి జెండావూపి ర్యాలీని ప్రారంభహంచారు.

మంత్రి నారాయణ, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సైకిల్‌ తొక్కుతూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. సైకిల్‌ తొక్కడం ఆరోగ్యమేకాక పర్యావరణ హితమన్నారు. దేశ వ్యాప్తంగా 132 నగరాల్లో ఏకకాలంలో సైకిల్‌ ర్వాలీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+