జగన్ కుట్రలకు వేరే సీఎం ఐతే.., మోడీపై ఫైట్: చంద్రబాబు ఆసక్తికరం

కుప్పం: ఏపీకి ప్రత్యేక హోదా పైన ఎట్టి పరిస్థితుల్లోను రాజీలేని పోరాటం చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం తేల్చి చజెప్పారు. పోరాడి అయినా హోదా సాధిస్తామన్నారు. తన కుప్పం పర్యటనలో భాగంగా సోమవారం ఆయన నియోజకవర్గంలో పర్యటించారు.

హంద్రీ- నీవా కాలువ, షాహీ గార్మెంట్స్‌ తదితరాలను సందర్శించారు. ప్రజలు, విద్యార్థులు, కార్మికులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. విభజన హేతుబద్ధంగా జరగలేదన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చిందని, దానిని నెరవేర్చాలన్నారు.

కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు వాస్తవాలను వక్రీకరిస్తున్నాయని, తమ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. తన స్థానంలో మరో నాయకుడు సీఎంగా ఉండి ఉంటే కాంగ్రెస్, వైసిపి కుట్రలకు భయపడి ఎప్పుడో చేతుతెల్తేసేవారన్నారు. తాను వేటికీ భయపడనన్నారు.

కుప్పంలో చంద్రబాబు

కుప్పంలో చంద్రబాబు

అమరావతి నిర్మాణానికి ఒక్క పిలుపు ఇస్తే పైసా పరిహారం తీసుకోకుండా రైతులు తన పైన నమ్మకం ఉంచి వేల ఎకరాల భూమి ఇచ్చారని, ప్రజలకు తనపై ఉన్న నమ్మకం ఉందన్నారు.

కుప్పంలో చంద్రబాబు

కుప్పంలో చంద్రబాబు

నేను ఎవరికైనా భయపడతానంటే అది ప్రజలకు మాత్రమే అన్నారు. తనపై ఒత్తిడి తెచ్చే శక్తి ఎవరికైనా ఉందంటే అది పేదలకే అన్నారు.

కుప్పంలో చంద్రబాబు

కుప్పంలో చంద్రబాబు

ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర ప్రగతిని చూసి ఓర్వలేని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డదిడ్డంగా మాట్లాడుతూ అరాచకాలు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తోందన్నారు.

కుప్పంలో చంద్రబాబు

కుప్పంలో చంద్రబాబు

కొంతమంది పంట కాలువలకు గండ్లు కొట్టే నీచానికి దిగజారారని చంద్రబాబు మండిపడ్డారు. కొందరు నీచుల కారణంగా కాలువ గట్లకు కూడా పోలీసు కాపలా పెట్టాల్సి వస్తోందన్నాన్నారు.

కుప్పంలో చంద్రబాబు

కుప్పంలో చంద్రబాబు

ప్రజలు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే బాగుండదని హెచ్చరించారు. రైల్వే చట్టం తరహాలో రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు, ప్రత్యేకించి ఆర్టీసీ ఆస్తుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామన్నారు.

కుప్పంలో చంద్రబాబు

కుప్పంలో చంద్రబాబు

డ్వాక్రా రుణ మాఫీ రెండో విడత నిధులను రెండు రోజుల్లో విడుదల చేస్తామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని ఒక్క బిడ్డ కూడా పౌష్టికాహార లోపంతో బాధపడకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

కుప్పంలో చంద్రబాబు

కుప్పంలో చంద్రబాబు

మీరు చాలా స్లోగా ఉన్నారని, మీ కన్నా నేనే ఫాస్ట్‌గా ఉన్నానని.. కుప్పం ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నవ్వుతూ అన్నారు. సాంకేతికంగా ప్రపంచ గమనాన్ని వివరించాలని ఆయన కొందరు విద్యార్థులను కోరారు. వారి మాటలు విన్న అనంతరం.. మీకన్నా ఫాస్ట్‌గా ఉన్నానంటూ చంద్రబాబు నవ్వుతూ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+