సోమిరెడ్డి కామెంట్స్: సాక్షి-జగన్ కార్నర్‌కు టిడిపి కొత్త ప్లాన్!

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: సాక్షి ప్రసారాలు ప్రజల పైన దుష్ప్రభావం చూపిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం నాడు మండిపడ్డారు. ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

పచ్చి అబద్దాలు చెప్పే జగన్ లాంటి నేతను ఇంత వరకు చూడలేదన్నారు. రెండేళ్లలో ఒక్క అవినీతి ఆరోపణను వారు రుజువు చేయలేదన్నారు. తన ఆస్తులను ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎందుకు అటాచ్ చేసిందో జగన్ గడపగడపకూ వెళ్లి ప్రజలకు చెప్పాలన్నారు.

ప్రజలను రెచ్చగొట్టేలా..: జగన్‌కు షాక్, సాక్షి పత్రిక పైన కేసు

సాక్షి మీడియా పైన ప్రసార భారతికి లేఖ రాస్తామని చెప్పారు. సాక్షి ప్రసారాలు ప్రజల పైన చెడు ప్రభావం చూపిస్తున్నాయన్నారు. లా కమిషన్ సిఫార్సుల ప్రకారం జగన్ ప్రతిపక్ష నేతగా కొనసాగేందుకు వీలు లేదన్నారు.

Chandrababu trying to corner YS Jagan

ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ ఏడాది దాటితే అలవెన్సులు, ఓటు హక్కు ఉండకూడదని లా కమిషన్ సిఫార్సు చేసిందన్నారు. జగన్ విషయంలో అమలు చేయాలని స్పీకర్‌ను కోరుతున్నామన్నారు. కాగా, సాక్షి ప్రసారాలను పూర్తిగా నిలిపివేయించడంతో పాటు, జగన్ సభ్యత్వాన్ని రద్దు చేయించేందుకు టిడిపి నేతలు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

వైసిపికి తూగోలో చేదు అనుభవం

వైయస్ డ్రెస్ చూసే, పరిటాలను చంపేశారు: జగన్‌పై దుమ్మెత్తిపోసిన కాల్వ

టిడిపి రెండేళ్ల పాలన, చంద్రబాబు ఎన్నికల హామీలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు వైసిపి 'గడపగడపకూ వైసిపి'ని శుక్రవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాలో ఆ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. వైసిపి నేత, మాజీ మంత్రి విశ్వరూప్, మరో నేత చిట్టబ్బాయిలను ఉప్పలగుప్తం మండలంలో ప్రజలు అడ్డుకున్నారు. దీంతో, వారు కార్యక్రమాన్ని రద్దు చేసుకొని వెనక్కి వెళ్లారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP CM Chandrababu Naidu trying to corner YSRCP chief YS Jaganmohan Reddy.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి