వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాదాస్పద విలీన మండలాల్లో చంద్రబాబు పర్యటన; వరద బాధితులకు పరామర్శ; ఆసక్తికర చర్చ!!

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జూలై 28 నేటి నుండి మరో విడత వరద పర్యటనను కొనసాగించనున్నారు. విలీన మండలాల్లో ఆయన రెండు రోజుల పాటు పర్యటించి వరద బాధితులను పరామర్శిస్తారు. గత వారం రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించి బాధితులను కలిసి వారికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన చంద్రబాబు, అప్పుడే వరద ప్రభావిత విలీన మండలాల్లో పర్యటనలు చెయ్యాలని భావించారు. కానీ వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో అప్పుడు పర్యటన విరమించుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు విలీన మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది.

పోలవరం విలీన మండలాలలో చంద్రబాబు పర్యటన ... ఆసక్తికరం

పోలవరం విలీన మండలాలలో చంద్రబాబు పర్యటన ... ఆసక్తికరం

పోలవరం విలీన మండలాల్లో వరద ప్రభావానికి గురైన అనేక గ్రామాల ప్రజలు తమని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తమను తెలంగాణలో కలపాలని రోడ్డెక్కి ఆందోళనలు చేసిన పరిస్థితులలో, ఇక విలీన మండలాలపై తెలంగాణ మంత్రులు సైతం వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు అక్కడికి వెళ్లి వరద బాధితులను పరామర్శించడం ఆసక్తికరంగా మారింది. విలీన మండలాలపై వివాదం నెలకొన్న నేపధ్యంలో చంద్రబాబు తాజా పర్యటన ఎలాంటి రాజకీయ పరిణామాలకు కారణం అవుతుందో అన్న చర్చ జరుగుతుంది.

చంద్రబాబు రెండు రోజుల పర్యటన షెడ్యూల్ ఇదే

చంద్రబాబు రెండు రోజుల పర్యటన షెడ్యూల్ ఇదే


ఇక చంద్రబాబు పర్యటన వివరాల్లోకి వెళితే ఉండవల్లి లో నివాసం నుండి రోడ్డు మార్గంలో వేలేరుపాడు మండలానికి చేరుకోనున్న చంద్రబాబు అక్కడ శివకాశి పురం లోని పునరావాస కేంద్రంలో బాధితులను పరామర్శిస్తారు. ఆపై కుక్కునూరు కు చేరుకుని చంద్రబాబు తెల్ల రాయి గూడెం లోని పునరావాస కాలనీ కి వెళ్లి బాధితులను పరామర్శించి వారితో మాట్లాడతారు. అక్కడ నుండి తెలంగాణ రాష్ట్రం బూర్గంపాడు, సారపాక లకు వెళ్లి వరద బాధితులను పరామర్శించి ఆపై భద్రాచలం చేరుకుంటారు. రాత్రికి భద్రాచలంలో బస చేయనున్న చంద్రబాబు శుక్రవారం ఉదయం ఎటపాక, కూనవరం, వరరామచంద్రాపురం, చింతూరు మండలాల్లో పర్యటిస్తారు.

విలీన మండలాల ప్రజల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోలేదని టీడీపీ ఆరోపణలు

విలీన మండలాల ప్రజల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోలేదని టీడీపీ ఆరోపణలు

ఏపీ ప్రభుత్వం వరద బాధితులకు సహాయం అందించడంలో విఫలమవుతోంది అని, ప్రభుత్వ వైఫల్యం వల్లే వరదలు అనేక మండలాలను ముంచెత్తాయి తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇక విలీన మండలాల ప్రజలు గతంలో విలీనం జరిగిన సమయంలో ఎటువంటి వ్యతిరేకతను వ్యక్తం చేయలేదని, ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే తమను తెలంగాణాలో కలపాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై విలీన ప్రాంతాల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని అభిప్రాయపడుతున్నారు. అందుకే తెలంగాణాలో కలపాలని అడుగుతున్నారని విమర్శిస్తున్నారు.

చంద్రబాబు విలీన మండలాల పర్యటన అందుకేనా .. అనుమానాలు

చంద్రబాబు విలీన మండలాల పర్యటన అందుకేనా .. అనుమానాలు

ఈ క్రమంలోనే చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాలు అయిన విలీన మండలాల్లో పర్యటన ఏపీ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది. కేవలం రాజకీయంగానే చంద్రబాబు విలీన మండలాల పర్యటన సాగుతుందా అన్న అనుమానం వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కావాలనే చంద్రబాబు అక్కడికి వెళ్తున్నారని, జగన్ పై వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేస్తున్నారని అనుమానిస్తున్నారు. కానీ వరద బాధితులకు భరోసా ఇవ్వటం కోసమే చంద్రబాబు పర్యటన చేస్తున్నారని చెప్తున్నారు టీడీపీ నేతలు.

English summary
Chandrababu is on a two-day tour of the controversial merger areas. The flood victims will be visited in many mandals of AP and Telangana. This will lead to an interesting discussion on his visit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X