బీజేపీకి వార్నింగ్.. గంటలో ఏం జరిగింది? ఆది సంచలనం: చంద్రబాబు అసహనం?

అమరావతి: ఏప్రిల్ 5న తమ పార్టీ కేంద్రమంత్రులు రాజీనామా చేస్తారని మంత్రి ఆదినారాయణ రెడ్డి చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. అయితే ఆ తర్వాత గంట తర్వాత ఆయన మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి అది తన వ్యక్తిగత అభిప్రాయమని తేల్చి చెప్పారు.

ఆయన తొలుత ఆరు గంటల సమయంలో తమ పార్టీ కేంద్రమంత్రులు కూడా రాజీనామా చేస్తారని ప్రకటన చేశారు. కానీ ఆ తర్వాత అది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఆది ప్రకటనను కొందరు నేతలు వెంటనే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లారని తెలుస్తోంది.

 టీడీపీ అధిష్టానం అసహనం

టీడీపీ అధిష్టానం అసహనం

ఆదినారాయణ రెడ్డి ప్రకటనపై టీడీపీ అధిష్టానం ఒకింత అసహనం వ్యక్తం చేసిందని తెలుస్తోంది. హడావుడిగా ఇలాంటి కీలక ప్రకటనలు చేయడం ఏమిటని చెప్పిందని సమాచారం. దీంతో ఆ తర్వాత మళ్లీ ఆయన గంట తర్వాత బయటకు వచ్చి అది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. ఈ గంటలో ఏం జరిగిందనే ఆసక్తికర చర్చ కూడా సాగుతోంది.

నష్టం పూడ్చే పనిలో

నష్టం పూడ్చే పనిలో

ఆదినారాయణ రెడ్డి ప్రకటన తెలియగానే పార్టీ నేతలు స్పందించారు. ఆయన ఆవేశంలో చేశారని, అది వ్యక్తిగత అభిప్రాయమని తేల్చి చెప్పారు. తద్వారా పార్టీకి జరగబోయే నష్టాన్ని తగ్గించే ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత బయటకు వచ్చిన ఆది కూడా మార్చి 5న డెడ్ లైన్ అనేది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు.

 ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలపై కౌంటర్‌గా

ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలపై కౌంటర్‌గా

ఓ మంత్రిగా ఉండి, టీడీపీలో కీలక నేతగా ఉన్న ఆదినారాయణ రెడ్డి ఆవేశంలో ఇలా మాట్లాడారని చెప్పడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనికి టీడీపీ కూడా కౌంటర్ ఇస్తోంది. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత అభిప్రాయం ఉంటుందని, గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్ నేతలు కూడా మంత్రులుగా ఉండి ఆందోళనలు, ధర్నాలు చేశారని, మరి అప్పుడు వారు ఎలా చేశారని ప్రశ్నించారు. పార్టీ అధికారికంగా ప్రకటిస్తే గుర్తించాలన్నారు.

 బీజేపీకి అల్టిమేటం నుంచి

బీజేపీకి అల్టిమేటం నుంచి

అంతకుముందు, ఆది మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన నేపథ్యంలో కేంద్రం హామీ ఇచ్చిన 19 అంశాలను నెరవేర్చకపోతే బీజేపీతో తెగదెంపులు చేసుకుంటామని అల్టిమేటం జారీ చేశారు. అలాగే, జగన్‌క ధీటుగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఇచ్చిన హామీలను కేంద్రం కచ్చితంగా నెరవేర్చాల్సిందేనని చెప్పారు. సమస్యలు పరిష్కరించకపోతే మార్చి 5న తమ పార్టీకి చెందిన కేంద్రమంత్రులు ప్రభుత్వం నుంచి బయటకు వస్తారన్నారు. ఎంపీల రాజీనామాలకు వైసీపీ డెడ్‌లైన్‌ ఏప్రిల్‌ 6 అయితే, తమ డెడ్‌లైన్‌ మార్చి 5 అన్నారు. అనుకూల ప్రకటన రాకుంటే ఆ రోజే తమ కేంద్రమంత్రులు రాజీనామా చేస్తారని, జగన్‌ తన ఎంపీలతో రాజీనామా చేయించడానికి ముందే తాము రాజీనామా చేస్తామన్నారు. మంత్రి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+