లూజ్ టాక్, పార్టీకి దూరమవుతారు: జేసీ వ్యాఖ్యలపై ఊగిపోయిన చంద్రబాబు

టిడిపి అనంతపురం పార్లమెంటు సభ్యులు, సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యల పైన ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారని తెలుస్తోంది.

విజయవాడ: టిడిపి అనంతపురం పార్లమెంటు సభ్యులు, సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యల పైన ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారని తెలుస్తోంది. పార్టీ నాయకుల సమావేశంలో ఆయన పరోక్షంగా మంగళవారం నాడు మండిపడ్డారు.

లూజ్ టాక్‌తో వాళ్ల నాయకత్వమే బలహీనపడుతుందన్నారు. పార్టీకి కూడా దూరమవుతారని హెచ్చరించారు. పార్టీలో అందరికీ స్వేచ్ఛ ఉందని చెప్పారు. పార్టీలో తనతో సహా ఎవరికీ మినహాయింపులు ఉండవని చెప్పారు.

పార్టీలో అందరూ సమానమేనని చంద్రబాబు అన్నారు. నాయకుడు సమర్థంగా లేకపోతే నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉన్నా నష్టపోతామన్నారు. నాయకుడు సమర్థుడయితేనే ఫలితాలు సానుకూలంగా ఉంటాయని చంద్రబాబు అన్నారు.

chandrababu naidu

ప్రతి సోమవారం, శుక్రవారం మంత్రులు సచివాలయానికి రావాలన్నారు. ఎమ్మెల్యేలు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికలు ఏకపక్షంగా ఉండాలన్నారు. ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవకాశమివ్వవద్దని చెప్పారు. సమస్యల పైన ప్రజాప్రతినిధులు అన్ని కోణాల్లో ఆలోచించాలన్నారు.

పదవుల అంశం నాకు వదిలేయండి

పార్టీలో పదవుల అంశం తనకు వదిలేయాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 50 నియోజకవర్గాలు పెరుగుతాయన్నారు. ఎమ్మెల్సీ స్థానాల్లో అవకాశం కల్పిస్తామన్నారు. వచ్చేసారి పార్టీ అధికారంలోకి రావాలంటే గ్రూపులకు స్వస్తీ చెప్పాలన్నారు.

ఇదిలా ఉండగా ప్రజాప్రతినిధులతో చంద్రబాబు ఈ రోజు సమావేశమయ్యారు. నియోజకవర్గాలుగా సర్వే రిపోర్టులు ఇచ్చారు. పనితీరు ఆధారంగా ప్రజాప్రతినిధులకు ర్యాంకులు ఇస్తున్నట్లు చెప్పారు. సమస్యలను పార్టీ దృష్టికి తీసుకు రావాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+