ముద్రగడ దీక్షపై వార్తాకథనాలు: మీడియాపై చంద్రబాబు రుసరుసలు
విజయవాడ: కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్షకు మీడియా ఇచ్చిన కవరేజీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రుసరుసలాడారు. ఓ వైపు ప్రపంచం కనీవినీ ఎరుగని రీతిలో విశాఖపట్నంలో ఫ్లీట్ రివ్యూ నిర్వహిస్తే ఆ వార్తలను వదిలి ముద్రగడ దీక్ష వార్తలను రాసి ప్రభుత్వానికి చెడు పేరు ఆపాదించే ప్రయత్నం చేశారని ఆయన మండిపడ్డారు.
తాను ఎన్నో దేశాలు తిరిగానని, ఎన్నెన్నో కార్యక్రమాలకు హాజరయ్యానని, కానీ విశాఖపట్నంలో నిర్వహించిన ఫ్లీట్ రివ్యూలాంటిది ప్రపంచ చరిత్రలో ఎన్నడూ జరగలేదని ఆయన అన్నారు. దాన్ని ఘనంగా నిర్వహించినందుకు తాను గర్వపడుతున్నట్లు తెలిపారు.

అయితే, అంత ముఖ్యమైన వార్తలు వదిలేసి ఎవరో తనను తిట్టారని వార్తలు ప్రధానంగా వార్తలు రాయడంలో అర్థమేమిటని ప్రశ్నించారు. తనను తిట్టిన వార్తలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా తిట్టినవాళ్లకు ప్రాధాన్యం కల్పిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు
ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే ముద్రగడ దంపతులు దీక్ష విరమించారని చెప్పారు. కాపుల్లో కూడా చాలా మంది పేదవాళ్లు ఉన్నారని, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సహకరిస్తామని చెప్పారు. తొమ్మిది నెలల్లోగా మంజునాథ్ కమిషన్ నివేదిక వస్తుందని, కాపు కార్పోరేషన్‌కు ఏటా రూ. వేయి కోట్ల నిధులు కేటాయిస్తామన ి చెప్పారు. తుని ఘటనపై విచారణ సాగుతోందని, రైలు దహనం కేసులో బాధ్యులపై కఠిన చర్యలుంటాయని చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications