విభజన కసితో షాకిచ్చారు, అడిగితేనే చేస్తానంటే ఎలా: కేంద్రానికి బాబు
విజయవాడ: సమన్వయం లేని విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కసి, ఆగ్రహం పెల్లుబికాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు అన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ అందుకు తగిన మూల్యం చెల్లించుకుందని చెప్పారు.
ఇతర రాష్ట్రాలతో సమానంగా నవ్యాంధ్రప్రదేశ్ ఎదిగే వరకు కేంద్రం తమకు సహాయం చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శితో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఉద్యోగుల విభజన సక్రమంగా జరిగేలా కేంద్రానికి తెలియజేయాలని కోరారు. అడిగితేనే చేద్దాం అనుకునే వైఖరి సరికాదన్నారు. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ కొఠారీతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

రాజధానిలో రైతుల వాటాపై భేటీ
రాజధాని అమరావతి ప్రాంతంలో రైతుల వాటా పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైతు కమిటీలు, స్థానిక ప్రజాప్రతినిధులతో మంత్రులు, సీఆర్డీఏ సభ్యులు భేటీ కానున్నారు. సాయంత్రం చంద్రబాబుతో సీఆర్డీఏ సభ్యులు, మంత్రులు భేటీ కానున్నారు.
ఇప్పటికే పలు దఫాలుగా మంత్రులు, సీఆర్డీఏ సభ్యులు అమరావతిలో రైతులకు ఇవ్వాల్సిన వాటా పైన పలుదఫాలుగా చర్చించారు. ఇప్పుడు మరోసారి భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విధివిధానాలతో పాటు రైతులు, వారి సమస్యలను తెలుసుకోనున్నారు.












Click it and Unblock the Notifications