ఆ ప్రకారం ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు: బాబుకు వెంకయ్య షాక్

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖ: ఎవరికీ లేనంత స్నేహ సంపద తనకు ఉందని, ప్రతి గ్రామంలోనూ తనకు స్నేహితులు ఉన్నారని, ఎక్కడకెళ్లినా అభిమానించే వాళ్లు ఉన్నారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శనివారం నాడు అన్నారు. తనకు బండి లేనప్పుడు బండి ఇచ్చేవారని, టిక్కెట్‌ లేనప్పుడు టికెట్‌ కొనిచ్చే వారన్నారు.

తనను ప్రేమతో చూసేవారన్నారు. ఏపీలోనే కాకుండా తమిళనాడు, కర్నాటక, కేరళ.. ఇలా అన్ని రాష్ట్రాల్లో స్వేహితులకు కొదువ లేదన్నారు. విశాఖపట్నంలోని నోవాటెల్‌ హోటల్‌లో ఆయనకు ఆత్మీయ అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య పై వ్యాఖ్యలు చేశారు.

ఒక్క ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర సమస్యలు పరిష్కారం కావన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని, మరో 11 రాష్ట్రాలు ఈ హోదా అడుగుతున్నాయని చెప్పారు. తద్వారా ఏపీకి హోదా వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. కాగా, అంతకుముందు రాంబిల్లి మండల పరిధి పూడి వద్ద జరిగిన ఎంఎస్‌ఎంఈ సాంకేతిక కేంద్రం, పెప్సీ బాట్లింగ్‌ పరిశ్రమల శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్య, కల్ రాజ్ మిశ్రా, ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.

 ఎంఎస్‌ఎంఈ సాంకేతిక కేంద్రం శంకుస్థాపన

ఎంఎస్‌ఎంఈ సాంకేతిక కేంద్రం శంకుస్థాపన

చిన్న పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు మెరుగుపడి దేశాభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్రమంత్రి కల్‌రాజ్‌ మిశ్రా అన్నారు. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో దేశంలో ఒక్క ఎంఎస్‌ఎంఈ సాంకేతిక కేంద్రమూ ప్రారంభించలేదని, మోడీ ప్రభుత్వం రెండేళ్ల కాలంలోనే దేశంలో 15 ఎంఎస్‌ఎంఈ కేంద్రాలు ఇచ్చిందన్నారు.

 ఎంఎస్‌ఎంఈ సాంకేతిక కేంద్రం శంకుస్థాపన

ఎంఎస్‌ఎంఈ సాంకేతిక కేంద్రం శంకుస్థాపన

వెంకయ్య మాట్లాడుతూ.. ప్రధాని మోడీ గంగా-కావేరి నదులను అనుసంధానం చేపడితే, ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం చేశారని, కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం చేపడుతున్నారని, పచ్చదనం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారన్నారు.

ఎంఎస్‌ఎంఈ సాంకేతిక కేంద్రం శంకుస్థాపన

ఎంఎస్‌ఎంఈ సాంకేతిక కేంద్రం శంకుస్థాపన

మచిలీపట్నంలో రక్షణ కర్మాగారం ఏర్పాటుచేస్తున్నామని, కర్నూలు జిల్లా నాగాయలంక, చిత్తూరు జిల్లా కొక్కిరాయకొండ ప్రాంతాల్లోనూ కర్మాగారాలకు స్థల సేకరణ జరుగుతుందన్నారు.

 ఎంఎస్‌ఎంఈ సాంకేతిక కేంద్రం శంకుస్థాపన

ఎంఎస్‌ఎంఈ సాంకేతిక కేంద్రం శంకుస్థాపన

చంద్రబాబు మాట్లాడుతూ.. విశాఖను దేశంలోనే నంబర్‌వన్‌ నగరంగా తీర్చిదిద్దుతానన్నారు. పూడిలో ఎంఎస్‌ఎంఈ కేంద్రం నిర్మాణం రెండేళ్లలో పూర్తవుతుందన్నారు. ఐదువేల మందికి ఉపాధి దక్కుతుందన్నారు.

 ఎంఎస్‌ఎంఈ సాంకేతిక కేంద్రం శంకుస్థాపన

ఎంఎస్‌ఎంఈ సాంకేతిక కేంద్రం శంకుస్థాపన

నైపుణ్యాభివృద్ధికి, ఉపాధి, పరిశ్రమల విస్తరణకు ఎంతగానో ఉపకరస్తుందని చంద్రబాబు అన్నారు. భోగాపురం గ్రీన్ ఫీల్డు విమానాశ్రయం ఏర్పాటుకు ప్రయత్నిస్తుంటే దాన్నికూడా గండికొట్టే ప్రయత్నాలు జరుగతున్నాయన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chandrababu & union ministers lay foundation to MSME technology centre.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X