చంద్రబాబు గ్యాడ్జెట్ ఖరీదు రూ.30వేలు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించే రాజకీయవేత్తగా పేరుపొందారు. కొత్త కొత్త సాంకేతికతను ఇష్టపడే చంద్రబాబు తాను అధికారంలో ఉన్న సమయంలో వాటిని అమలు చేసేవారు. మార్కెట్ లోకి కొత్త గ్యాడ్జెట్స్ వచ్చిన వెంటనే వాటిగురించి వాకబు చేసి అవసరమనుకుంటే కొనుగోలు చేసేవారు. తన ప్రభుత్వంలో కూడా ఆయన టెక్నాలజీకి ప్రోత్సాహం ఇస్తుంటారు. అంతేకాదు ఆయన కూడా పలు రకాల గ్యాడ్జెట్స్ ను ఉపయోగిస్తుంటారు. చంద్రబాబు తన ఎడమచేతి చూపుడువేలుకు ఒక స్మార్ట్ రింగ్ ధరిస్తున్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొనడానికి వచ్చినప్పుడు విలేకరులు స్మార్ట్ రింగ్ గురించి అడిగారు.

chandrababu use new gadjet cost 30,000 rupees

దాన్ని తనచూపుడు వేలుకు ధరిస్తుంటానని, అయితే అందరూ అనుకుంటున్నట్లుగా అలంకారం కోసం పెట్టుకున్న రింగ్ కాదన్నారు. తన ఫిట్ నెస్ గురించి ఎప్పటికపపుడు తెలియజేసేది అని చంద్రబాబు విలేకరులకు వివరించారు. తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ దాన్ని వెంటనే తన ఫోన్ కు సందేశాన్ని పంపిస్తుందని, అందులో చిన్న చిప్ ఉంటుందని, తన శరీరంలో ఆక్సిజన్ లెవల్స్, బీపీ, షుగర్ లెవల్స్ ను కనిపెడుతుంటుందని, ఆరోగ్యానికి సంబంధించిన మొత్తం డేటాను అది క్రోడీకరించి తన ఫోన్ కు పంపుతుందని వెల్లడించారు. రూ.30వేలు పెట్టి కొన్నానని, శరీరానికి ఎటువంటి హాని ఉండదన్నారు. రేడియేషన్ కూడా ఈ రింగ్ నుంచి రాదన్నారు. ఆరోగ్యానికి అన్నివిధాలా శ్రేయస్కరమని చెప్పడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు పలువురు దీన్నిగురిచి సెర్చ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+