'అవినీతి కేసులు బయటకు రాకుండా టీటీడీని ఉపయోగించుకున్న చంద్రబాబు'

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, యువతులు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి శుక్ర వారం ఆరోపించారు. అత్యాచారాలకు నిరసనగా రేపు (శనివారం) క్యాండిల్ ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఏడు గంటల వరకు ఈ ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. అన్ని నియోజకవర్గాలలోని ప్రధాన సెంటర్లలో నిరసన ఉంటుందన్నారు.

చంద్రబాబుకు బీజేపీతో లోపాయికారి ఒప్పందం ఉందని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. మే 14న తమ పార్టీ అధినేత వైయస్ జగన్ పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. ఏలూరులో ఆయన పాదయాత్ర 2,000 కిలోమీటర్ల మైలు రాయి చేరుకుంటుందన్నారు.

Chandrababu used TTD for his corruption

చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, అందుకు నల్ల జెండాలతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతామని చెప్పారు. 14, 15వ తేదీల్లో జిల్లా వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తామని చెప్పారు. 16వ తేదీన వంచపై గర్జన పేరిట ధర్నాలు చేసి, అనంతరం కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తామని చెప్పారు.

బీజేపీ మంత్రి భార్యను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులోకి తీసుకోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు తన అవినీతి కేసులు బయటకు రాకుండా టీటీడీని ఉపయోగించుకున్నారని ఆరోపించారు. బీజేపీతో ఆయనకు అంగీకారం ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+