చంద్రబాబు ఆ రెండు పేపర్లను వాడుకుంటున్నారు: శ్రీకాంత్ రెడ్డి

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడదిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడదు గండికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాస్తవాలను కప్పిపుచ్చడానికి చంద్రబాబు రెండు పేపర్లను వాడుకుంటున్నారని, అవి న్యూస్ పేపర్లు, వైట్ పేపర్లు అని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

గ్రామగ్రామాన మాఫియాను ప్రవేశపెట్టిన ఘనుడు చంద్రబాబు నాయుడేనని ఆయన అన్నారు. ఒకప్పుడు మాఫియా అనే పదం ముంబైలో మాత్రమే వినిపించేదని, చంద్రబాబు పుణ్యమా అని ఇప్పుడు పల్లెటూళ్లలో కూడా వినిపిస్తోందని ఆయన అన్నారు.

Chandrababu using two news papers: Srikanth

టిడిపి ప్రభుత్వ హయాంలో ఇసుక క్వారీల్లో అక్రమాలు పెరిగాయని ఆయన ఆరోపించారు. ఆరేళ్ల క్రితం ట్రాక్టర్ ఇసుక వేయి రూపాయల లోపు ఉండేదని, ఇప్పుడు వేలల్లో ఉందని ఆయన అన్నారు. ఇసుక క్వారీల్లో దోపడీ జరగలేదని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని శ్రీకాంత్ రెడ్డి అడిగారు. ఎటువంటి అక్రమాలు జరగకపోతే శ్వేతపత్రాలు ఎందుకు విడుదల చేస్తున్నారని ఆయన అడిగారు.

శ్వేతపత్రానికి ఉన్న అర్థాన్ని మార్చేసి పసపు పత్రంగా మార్చేశారని ఆయన వ్యాఖ్యానించారు. దోపిడీ, అక్రమాలను అరికట్టకుండా ప్రజలను మభ్య పెట్టేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఇసుక సరఫరా ఆగిుపోవడంతో నిర్మాణాలు పూర్తిగా ఆగిపోయాయని, నిర్మాణ రంగ కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+