మన సమంత చీర కట్టింది సరే!: వెంకయ్య, మోడీ మట్టే తేలేదు.. (పిక్చర్స్)
గుంటూరు: ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి ఐదేళ్లలో రూ.1505 కోట్లు వెచ్చించి అంతర్జాతీయ ప్రమాణాలు కల్పించి అగ్రశ్రేణి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు తెలిపారు.
అనునిత్యం పరిశోధన, విస్తరణ, క్షేత్ర స్థాయి అనుసంధానం, ప్రపంచంలో పేరుపొందిన విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని వర్సిటీని తీర్చిదిద్దుతామన్నారు. గుంటూరు జిల్లా లాం గ్రామంలో సోమవారం ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం భూమిపూజతో పాటు శిలాఫలకాల ఆవిష్కరణ జరిగింది.
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక గజపతిరాజు, సుజనా చౌదరి తదితరులతో కలసి కేంద్రవ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వెంకయ్య నోట హీరోయిన్ సమంత పేరు వచ్చింది. ఆమె అప్పుడప్పుడు చీరను కట్టుకుంటుంది అని చమక్కులు వేశారు. ఇటీవల ప్రధాని మోడీ బ్రిటన్ పర్యటనను గుర్తుకు తెచ్చుకున్నారు. మోడీకి స్వాగతం పలికేందుకు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ భార్య సమంతా చీర కట్టుకు వచ్చిందన్నారు.
ప్రధాని మోడీ ప్రభావంతో భారతీయతకు అద్దం పడుతూ బ్రిటన్ ప్రధాని భార్య సమంత చీరకట్టుకుని వచ్చారని, మనకూ ఓ సమంత ఉందని, ఆమె కూడా చీరలో కనిపిస్తుందన్నారు. మన సమంత చీర కట్టిందంటే సరే... కామెరాన్ భార్య కూడా కట్టుకుందంటే ప్రధాని మోడీకి దక్కిన గౌరవమే అన్నారు. ఆయన మాటలతో అక్కడి వారు నవ్వేశారు.

చంద్రబాబు
ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి ఐదేళ్లలో రూ.1505 కోట్లు వెచ్చించి అంతర్జాతీయ ప్రమాణాలు కల్పించి అగ్రశ్రేణి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

చంద్రబాబు
చంద్రబాబు మాట్లాడుతూ... కృష్ణా డెల్టాలో సాగునీరు అందక పంటలు సాగు చేయని రైతులకు రబీకి అవసరమైన విత్తనాలను 80 శాతం రాయితీపై అందిస్తామన్నారు. మినుము, పెసర మద్దతు ధరకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం క్వింటా రూ.వేయి చొప్పున అందించి రైతులను ఆదుకుంటుందన్నారు.

చంద్రబాబు
దేశంలో చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని, తీరప్రాంతాన్ని ఉపయోగించుకుని ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుకునేలా ప్రణాళికలు అమలు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

రాధా మోహన్ సింగ్
రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి విజయవాడలో ప్రాంతీయ కార్యాలయం, తల్లీ పిల్లరొయ్యల ఉత్పత్తికి ప్రత్యేక కేంద్రం మంజూరు చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ ప్రకటించారు.

రాధా మోహన్ సింగ్
వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం దేశం మొత్తానికి ఒకే విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని, వ్యవసాయ ఉత్పత్తులు, మార్కెట్‌యార్డులను అనుసంధానించి ఎక్కడ ఎక్కువ ధర లభిస్తే అది రైతుకు అందేలా చూస్తామని రాధా మోహన్ సింగ్ తెలిపారు.

రాధా మోహన్ సింగ్
దేశంలోని రైతులందరికీ వారి భూమి ఆరోగ్యానికి సంబంధించి కార్డులు జేబులో ఉండేలా రాబోయే రెండేళ్లలో చర్యలు చేపడుతున్నామని వివరించారు.

వెంకయ్య నాయుడు
అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ నీరు, మట్టి ఇచ్చి వెళ్లారని... నిధులు విడుదల చేయలేదని తల్లీ, పిల్ల కాంగ్రెస్ వ్యంగ్యంగా మాట్లాడుతూ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ధ్వజమెత్తారు.

వెంకయ్య నాయుడు
కేంద్ర సహకారంతో రాష్ట్రంలో ఏర్పాటుచేసిన సంస్థలు, వాటికి మంజూరు చేసిన నిధులను ప్రాజెక్టులవారీగా వివరించారు. వచ్చే నెలలో ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేస్తామన్నారు. ఈ నిధులన్నీ తల్లి, పిల్ల కాంగ్రెస్‌కు మట్టి, నీళ్లు లాగానే కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు.

వెంకయ్య నాయుడు
ఏపీకి ప్రత్యేక హోదాపై నీతిఆయోగ్ చర్చిస్తోందని పునరుద్ఘాటించారు. విశాఖ-చెన్నై నడవా (కారిడార్)కు కేంద్రం రూ.20వేల కోట్ల పెట్టుబడి పెడుతోందన్నారు.












Click it and Unblock the Notifications