చంద్రబాబు విశాఖ పర్యటనపై ఉత్కంఠకు తెర: 25న ఉదయానికి ఏపీలోకి ఎంట్రీ
హైదరాబాద్/అమరావతి: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పర్యటనపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. విశాఖపట్నం వెళ్లేందుకు చంద్రబాబుకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అనుమతిచ్చారు. దీంతో చంద్రబాబు విశాఖ పర్యటన ఖరారైంది.
సోమవారం ఉదయం 10 గంటలకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖకు చేరుకుంటారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రాంతాల్లో పర్యటించి, ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలోని గ్యాస్ లీక్ ప్రమాదంలో మృతుల కుటుంబాలను చంద్రబాబు పరామర్శించనున్నారు. అనంతరం స్థానిక టీడీపీ నాయకులతో భేటీ కానున్నారు.

సోమవారం సాయంత్రం రోడ్డు మార్గంలో చంద్రబాబు అమరావతిలోని తన నివాసానికి చేరుకుంటారు. అయితే, చంద్రబాబు వెంట ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ కూడా వస్తారా? లేదా? అనేది తెలియరాలేదు.
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో మార్చి 20 నుంచి చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉండిపోవడంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రతిపక్ష నేతగా ఉండి రాష్ట్రాన్ని వదిలేసి పొరుగు రాష్ట్రంలో ఉంటున్నారని ఆరోపించారు.
కాగా, చంద్రబాబు డీజీపీని విశాఖ పర్యటనపై అనుమతి కోరడంపై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఇంతకుముందు స్పందించారు.
చంద్రబాబు విశాఖలో పర్యటిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సుచరిత అన్నారు.
చంద్రబాబు ఏపీ డీజీపీకి ఎప్పుడు లేఖ రాశారు? డీజీపీకి దరఖాస్తు చేస్తే తగిన ఆధారాలు చూపించాలని సుచరిత అన్నారు. ఏపీలో దరఖాస్తు చేయకుండా చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. చంద్రబాబు దరఖాస్తు చేస్తే అనుమతి ఇస్తాం.. ఇందులో ఎలాంటి వివాదం లేదని మంత్రి స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్‌లు విశాఖ బాధితులను పరామర్శించారని, వారిని ఎవరూ అడ్డుకోలేదని తెలిపారు.
Recommended Video
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications