సింగపూర్, జపాన్ దేశాలకు చంద్రబాబు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ఖరారైంది. నవంబర్ నెలలో ఆయన విదేశాల్లో పర్యటించనున్నారు. వచ్చే నెల 12, 13, 14న సింగపూర్‌లో, 24, 25, 26 తేదీల్లో జపాన్‌లో పర్యటించనున్నారు. జపాన్‌ పర్యటనలో భాగంగా అక్కడి పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశం అవుతారు. చంద్రబాబు వెంట రాజధాని సలహా కమిటీ సభ్యులు మంత్రి నారాయణ, ఎంపీలు సుజనా చౌదరి, గల్లా జయదేవ్‌, కంభంపాటి రామ్మోహన్ రావు ఇతర ఉన్నతాధికారులు ఉంటారు.

చంద్రబాబు తన పర్యటనలో రాజధాని కోసం పరిశీలన చేస్తారు. ఇదిలా ఉండగా, చంద్రబాబు రేపు ముంబయి వెళ్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గం ఆహ్వానం మేరకు మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హజరుకానున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది.

హుధుద్ తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్ర జిల్లాలు ఇప్పటిలో కోలుకోలేవేమోనని కలత చెందానని, కానీ అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేశామని, ఆత్మస్థైర్యంతో కోలుకున్నామని, రికార్డు సమయంలో విద్యుత్తు సరఫరాను సాధారణ స్థాయికి తీసుకువచ్చామని, ఇప్పుడు గిరిజన తండాల్లోనూ విద్యుత్తును పునురుద్ధరిస్తామని చంద్రబాబు బుధవారం అన్నారు.

Chandrababu to visit Japan next month

హుధుద్ బీభత్సం అనంతరం చేపట్టిన చర్యలపై విద్యుత్తు శాఖ అధికారులతో చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశం వివరాలను ఏపీ ఎనర్జీ కన్జర్వేషన్‌ మిషన్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎ చంద్రశేఖర్‌ వెల్లడించారు. హుధుద్ తుఫాను వల్ల ఎదురైన కష్టనష్టాలను ఒక గుణపాఠంగా తీసుకుని భవిష్యత్‌లో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలనైనా దీటుగా ఎదుర్కొనేలా విద్యుత్తు వ్యవస్థ పునర్వ్యవస్థీకరణకు ప్రణాళికలు రూపొందించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.

కోస్తాంధ్రలో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేందుకు వీలుగా భూగర్భ ఎలకి్ట్రకల్‌ కేబుల్‌ వ్యవస్థ ఏర్పాటు చేయడంపై దృష్టిపెట్టాలన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో తుఫాను, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో చాలా వరకు విద్యుత్తు వ్యవస్థను పునరుద్ధరించామని అధికారులు వివరించారు.

ఇంకా గిరిజన తండాల్లో విద్యుత్తు వెలుగులు రాలేదని, తనకు ప్రతి గిరిజన గుడిసె కూడా దేవాలయంతో సమానమని ప్రతి ఇంటికీ విద్యుత్తును ఇవ్వాల్సిందేనని, ఇందుకోసం ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. తుఫాను విలయంపై షార్ట్‌ ఫిలిం రూపొందించాలని, దీని ఆధారంగా భవిష్యత్‌లో విద్యుత్తు అత్యవసర పునరుద్ధరణ వ్యవస్థ అమలుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+