నాడు వైఎస్సార్ ను గాలిలో కలిసిపోతావన్నావ్.. ఇప్పుడు జగన్ ను చంపెయ్యాలంటున్నావ్.. మర్చిపోను చంద్రబాబు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతుంది. తాజాగా బొబ్బిలి మెయిన్ రోడ్డు సెంటర్లో నిర్వహించిన రోడ్ షోలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కుర్చీలు లాక్కోవడం, వెన్నుపోటు పొడవడం, మోసం చేయడం, మనుషుల్ని చంపేయడం ఇది చంద్రబాబు రాజకీయమని అలాంటి చంద్రబాబుకి ఓటేయమని అడిగే అర్హత ఎక్కడుందని వైయస్ జగన్ నిలదీశారు.
మీకు అందుతున్న పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలివి
ఈ ఎన్నికలలో జగన్ కు ఓటేస్తే పథకాల కొనసాగింపు, అదే చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు అంటూ పేర్కొన్న ఆయన చంద్రబాబును నమ్ముకుంటే మళ్ళీ మోసపోవడం ఖాయం అన్నారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు కాదని, ఈ ఓటుతో మీ తలరాతలు మారుతాయి అని జగన్ పేర్కొన్నారు. మీరు రాబోయే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించేవి ఎన్నికలని మీకు అందుతున్న పథకాల కొనసాగింపును నిర్ణయించేవి ఈ ఎన్నికలన్నారు.

చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పేదవాడైనా మేలు చేశాడని చెప్తాడా
చరిత్రలో ఎన్నడు లేని విధంగా వైసిపి పాలన సాగిందని, లంచాలు, వివక్ష లేకుండా నేరుగానే సంక్షేమాన్ని అందించామని ప్రతి ఒక్కరికి మీ అకౌంట్లోకి డబ్బులు పంపామని జగన్ గుర్తు చేశారు. అన్ని వర్గాల వారికి సమన్యాయం చేశామని, సామాజిక న్యాయం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది అన్నారు. చంద్రబాబు 14ఏళ్ళు సీఎం గా చేశారని చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పేదవాడికైనా మంచి చేసినట్టు గుర్తుకు వస్తుందా చెప్పాలని ప్రశ్నించారు.
ఈ జగన్ ను చంపేస్తే ఏమవుతుంది?
ఎన్టీఆర్ కుర్చీని లాక్కొని సొంత పార్టీ అధ్యక్షుడుని కుట్రలతో చంపేసిన వ్యక్తి , వంగవీటి మోహన్ రంగాను కుట్రలతో చంపిన వ్యక్తి ,ఐఏఎస్ అధికారి రాఘవేంద్రను కుట్రలతో చంపిన వ్యక్తి ఈ జగన్ ను చంపేస్తే ఏమవుతుంది అని అంటున్నారని మీ బిడ్డను ప్రజల్లో ఓడించలేరని అర్థమయ్యే.. ఎన్ని మోసపూరిత మాటలు చెబుతున్న ప్రజలు ఎవరూ నమ్మడం లేదని అర్థమయ్యే చంద్రబాబు జగన్ ను చంపేయాలి అని అంటున్నారన్నారు.
మీ దీవెనలే నాకు శ్రీరామ రక్ష
ఇది రాష్ట్ర రాజకీయాల్లోనే సిగ్గుచేటు పరిణామం అన్నారు.అయితే చంద్రబాబు అనుకుంటే జగన్ చనిపోవడం జగన్ ను ప్రజలే రక్షించుకుంటారని వైయస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అవ్వతాతలు, అక్క చెల్లెమ్మల ప్రార్థనలు, దీవెనలే తనకు శ్రీరామరక్ష అన్నారు. తనపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనాన్ని తెలియజేస్తున్నాయని అన్నారు.
బాబు మెంటల్ ఏ స్థాయిలో ఉందో చూశారా
మహానేత వైయస్సార్ కు వచ్చిన ప్రజాదరణ తట్టుకోలేక అసెంబ్లీ సాక్షిగా నువ్వు గాలిలో కలిసి పోతావని అన్న మాటలను నేను మరిచిపోలేనని, నాడు నా తండ్రిని నేడు నన్ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక నువ్వు మాట్లాడే మాటలు నీ నేర ప్రకృతికి అద్దం పడుతున్నాయని వైయస్ జగన్ ఆరోపించారు. బాబు మెంటల్ ఏ స్థాయిలో ఉందో ప్రజలంతా అర్థం చేసుకోవాలని అన్నారు.
చంద్రబాబుతో జాగ్రత్త
2014లో మేనిఫెస్టో తో చంద్రబాబు చేసిన మోసం ఇంకా గుర్తుందా అంటూ ప్రజలను ప్రశ్నించిన జగన్, ఏ ఒక్క వర్గానికి చంద్రబాబు న్యాయం చేయలేదని గుర్తు చేశారు. మళ్లీ కుట్రపూరిత హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.












Click it and Unblock the Notifications