చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీ టికెట్ ఆశావహులకు చంద్రబాబు హెచ్చరిక-నేనే ఫైనల్ చేస్తా-వచ్చేది మన ప్రభుత్వమే..

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని టార్గెట్ పెట్టుకున్న టీడీపీ ఇప్పటి నుంచే ఆ దిశగా పార్టీ నేతల్ని నడిపించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఈసారి టికెట్లు ఆశిస్తున్న వారికి అధినేత చంద్రబాబు ఇవాళ కీలక హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆయా ఆశావహులంతా తమ అవకాశాలపై మరోసారి ఆలోచించుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడుతోంది.

టీడీపీ టిక్కెట్ ఆశావహులకు టీడీపీ అధినేతచంద్రబాబు నాయుడు కీలక హెచ్చరికలు చేశారు. పీలేరులో జరిగిన జిల్లా పార్టీ సమీక్షా సమావేశంలో చంద్రబాబు ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఫీల్డ్ లో పనిచేస్తున్నారో.. ఎవరు పని చేయకుండా నా దగ్గరకు వచ్చి మాటలు చెప్తున్నారో నాకు తెలుసని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మూడేళ్ల నుంచి నియోజకవర్గాల్లో ఏమి జరుగుతోందో అన్నీ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నా అని కార్యకర్తలకు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనేది తాను మాత్రమే ఫైనల్ చేస్తానన్నారు.

chandrababu warns tdp ticket aspirants, allotment with tracking everything in last 3 years

రాష్ట్రంలో టీడీపీ టికెట్లు ఆశిస్తున్న అందరి డేటా తన దగ్గర ఉందని చంద్రబాబు తెలిపారు. ముందు టీడీపీ పని అయిపోయిందని జగన్ సంబరపడ్డారని, ఇవాళ టీడీపీని చూసి జగన్ భయపడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
రాష్ట్రంలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. నియోజకవర్గాల్లో ఉన్న లోపాలను సరిచేస్తానని కార్యకర్తలకు చంద్రబాబు హామీ ఇచ్చారు.

చిత్తూరు జిల్లాలో టీడీపీ పరిస్దితి నానాటికీ దయనీయంగా మారుతోంది. స్వయంగా తన కుప్పం నియోజకవర్గంలోనే వైసీపీ సత్తాచాటుతోంది. వచ్చే ఎన్నికల నాటికి పరిస్దితులు ఎలా ఉంటాయో తెలియదు. దీంతో అప్రమత్తం కాకపోతే పుట్టి మునుగుతుందని భావిస్తున్నచంద్రబాబు నేతలకు ఈ హెచ్చరికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కుప్పంలో వైసీపీ అభ్యర్ధిని ప్రకటించడం ద్వారా తన చిరకాల ప్రత్యర్ధి పెద్దిరెడ్డి ఓ అడుగు ముందుకేశారు. దీంతో జిల్లాపై తన పట్టు పూర్తిగా కోల్పోకుండా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

English summary
tdp chief chandrababu issued warning to tdp ticket aspirants in pileru party cadre meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X