Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వీఆర్ లో కూడా ఓవర్ యాక్షన్ చేసిన అధికారులు, తిక్కచేష్టలు వద్దని చంద్రబాబు వార్నింగ్

విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తర్వాత సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్న కొందరు సీనియర్ అధికారులు తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు ఆసహనం వ్యక్తం చేశారు. అధికారులు ఇంకా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నట్లు ఫీల్ అయిపోతున్నారని చంద్రబాబు మండిపడ్డారని తెలిసింది.

వరద ప్రభావిత ప్రాంతాలలో అధికారులు ప్రవర్తించిన తీరుతో కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, ఇలాంటి అధికారులు పద్ధతి మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని సీఎం చంద్రబాబు నాయుడు కొందరు అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అని వెలుగు చూసింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులతో అంటకాగిన, ఆ పార్టీ ముద్ర వేసుకున్న అధికారులు విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో విధుల్లో ఉన్నారు.

Chandrababu was furious with the negligence of the authorities in taking relief measures for the flood victims

ఆహార పొట్లాలు, తాగునీరు బాటిల్లు బాధితులకు అందించడంలో కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఓ మంత్రి ఇదే సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి నుండి సమాచారం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు గోపాలకృష్ణ, సత్యానంద్, శ్రీకాంత్, రఘువీరారెడ్డి, విజయరావు, విజయరామిరెడ్డి అనే అధికారుల తీరుపై సమావేశంలోనే మండి పట్టారని తెలిసింది.

వైసీపీ ఆడినట్లు ఆడిన కొందరు అధికారులను వీఆర్ కు పంపించామని, అందుకు మా మీద పగతో వరద బాధితులకు అన్యాయం చెయ్యడానికే వీళ్లు మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడుఆ అధికారుల తీరుపై మండిపడ్డారని తెలిసింది. మిమ్మల్ని వీఆర్కు పంపించినా ఇంకా బుద్ధి రాలేదని, మీ పద్ధతి మార్చుకొని ప్రభుత్వానికి సహకరిస్తే బాగుంటుందని, ఇలాంటి సమయంలో అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారని తెలిసింది.

Chandrababu was furious with the negligence of the authorities in taking relief measures for the flood victims

విజయవాడలో వరద బాధితులకు సహాయం చేయడానికి ఒక వార్డుకు ఒక సీనియర్ అధికారిని నియమించారు. వరద బాధితులకు ఆహార పొట్లాలు, పండ్లు, వాటర్ బాటిల్ అందించే విషయంలో అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని, నిర్లక్షం చెయ్యకుండా వరద బాధితులను ఆదుకోవడానికి అందరూ సహకరించాలని సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+