నంద్యాల ఎఫెక్ట్: మండలి ఛైర్మెన్ పదవి ఫరూక్‌కేనా, శిల్పా చేజార్చుకొన్నారా?
శాసనమండలి ఛైర్మెన్ పదవి ముస్లింలకే కేటాయించనున్నట్టు చంద్రబాబు ప్రకటనఫరూక్‌కు ఈ పదవి దక్కుతోందా అనే చర్చ కూడ లేకపోలేదు
నంద్యాల: నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలు మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. అయితే శాసనమండలి ఛైర్మెన్ పదవిని కూడ ముస్లింలకే ఇవ్వనున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించడంతో ఈ పదవి ఫరూక్‌కు దక్కనుందా అనే చర్చ మాత్రం లేకపోలేదు.శిల్పా చక్రపాణిరెడ్డి టిడిపిని వీడకపోతే మండలి ఛైర్మెన్ పదవి చక్రపాణిరెడ్డికి దక్కేదని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఈ పదవిని శిల్పా చేజార్చుకొన్నారని టిడిపి నేతలంటున్నారు.
నంద్యాల ఉపఎన్నికలు కొందరికి పదవులను తెచ్చిపెట్టాయి. సుదీర్ఘ కాలంగా టిడిపిలో కొనసాగుతున్న మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్‌కు ఈ ఉపఎన్నికల కారణంగా ఎమ్మెల్సీ పదవి దక్కింది.
అంతేకాదు నంద్యాల పట్టణానికి చెందిన నౌమన్‌తో పాటు మరికొందరికి టిడిపి అధినేత చంద్రబాబునాయుడు నామినేట్ పదవులను కట్టబెట్టారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపు ఓటములపై ముస్లిం ఓట్లు ప్రభావం చూపనున్నాయి.
ముస్లిం ఓట్లను ఎక్కువ శాతం తమ వైపుకు తిప్పుకొనేందుకుగాను రెండు పార్టీల నేతలు ప్రయత్నాలను చేస్తున్నారు. ఈ మేరకు రెండు పార్టీలకు చెందిన వ్యూహరచన చేస్తున్నారు.

నంద్యాలకు నామినేటేడ్ పదవులు
నంద్యాల అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని మాజీ మంత్రి ఎన్ఎండి పరూక్‌కు ఏపీ సీఎం ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే ఫరూక్‌ను అమరావతికి రప్పించుకొని ఈ విషయాన్ని చెప్పారు. హమీ ఇచ్చినట్టుగానే ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు చంద్రబాబునాయుడు. అయితే ఫరూక్ కంటే ముందుగానే పార్టీలో చేరిన నౌమాన్‌కు నామినేట్ పోస్టును కట్టబెట్టడంతో ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవి దక్కింది.

ముస్లింలకు శాసనమండలి ఛైర్మెన్ పదవి
ముస్లింలకు శాసనమండలి ఛైర్మెన్ పదవిని ఇవ్వనున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు.అయితే తాజాగా ఎమ్మెల్సీ బాధ్యతలను చేపట్టిన ఫరూక్‌కు ఈ పదవి దక్కనుందా అనే చర్చ కూడ సాగుతోంది. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఫరూక్ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అంతేకాదు మంత్రిగా కూడ పనిచేశారు. అయితే ఈ కారణంతోనే మండలి ఛైర్మెన్ పదవి ఫరూక్ ఇస్తారా అనే చర్చ కూడ టిడిపిలో సాగుతోంది. ఒకవేళ పార్టీ కార్యక్రమాల కమిటీలో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్సీ అహ్మద్ షరీఫ్‌కు ఈ పదవి దక్కే అవకాశం కూడ లేకపోలేదనే చర్చ కూడ ఉంది.అహ్మద్ షరీఫ్ కంటే ఫరూక్‌కే ఈ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

నంద్యాల నియోజకవర్గానికే మండలి ఛైర్మెన్ దక్కేనా
మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి టిడిపిలో ఉన్న సమయంలో శాసనమండలి ఛైర్మెన్ పదవిని ఆయనకే ఇస్తానని చంద్రబాబునాయుడు హమీ ఇచ్చారు. అయితే సోదరుడు మోహన్‌రెడ్డి టిడిపి నుండి వైసీపీలో చేరడంతో ...టిడిపి నాయకత్వం తనను అవమానాలకు గురిచేస్తోందనే కారణంతో శిల్పా చక్రపాణిరెడ్డి కూడ వైసీపీలో చేరారు. ఎమ్మెల్సీ పదవికి కూడ శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా చేశారు.ఈ రాజీనామా కూడ ఆమోదం పొందింది.అయితే ఈ కారణంగానే శిల్పా పార్టీ మారడంతో ఈ పదవిని అదే నియోజకవర్గానికి చెందిన ఫరూక్ ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు పార్టీ వర్గాలు.

పార్టీని నమ్ముకొన్న వారికి పదవులు
పార్టీని నమ్ముకొన్న వారికి పదవులు ఇచ్చి గౌరవిస్తామనే సంకేతాలు ఇచ్చే ఉద్దేశ్యంతో ఇటివల నామినేటేడ్ పదవుల పంపకం సాగిందని కొందరు పార్టీ నాయకులు అంతర్గత సమావేశాల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రామసుబ్బారెడ్డికి, ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవులను ఇచ్చి పార్టీ ఆదుకొన్న విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications