అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైట్లీకి బాబు 'ప్రత్యేక' చిట్టా: '19 నాటికి రాజధాని పూర్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్ర విభజన జరిగి ఏడాది గడుస్తున్న సందర్భంగా విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.

రాజధాని నిర్మాణానికి మరో రూ.3,500 కోట్లు ఇవ్వాలని కోరారు. ప్రత్యేక హోదాకు కావాల్సిన అర్హతలున్న ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు వచ్చే నాలుగేళ్లలో రూ.200 కోట్ల చొప్పు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీని ప్రత్యేక హోదా రాష్ట్రాలతో సమానంగా చూసి విదేశీ రుణాల్లో 90 శాతం కేంద్రమే భరించాలని కోరారు.

పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. 20 శాతానికి పెంచాలన్నారు. మిగతా రాష్ట్రాలతో సమానంగా ఎదగడానికి కేంద్రం నుండి ఏమేమి ఆశిస్తోంది పాయింట్ల వారిగా జైట్లీకి చంద్రబాబు నాయుడు వివరించారు.

Chandrababu writes letter to Jaitley

2019 నాటికి తొలిదశ రాజధాని నిర్మాణం పూర్తి

రాజధాని సుందరంగా, సౌకర్యవంతంగా ఉంటుందని, 2019 నాటికి తొలి దశ పూర్తి చేస్తామని మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ, వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వేకుదా చెప్పారు. రాజధాని భూమి పూజ పొలాన్ని గురువారం వారు పరిశీలించారు.

ఏర్పాట్ల గురించి కలెక్టర్‌ కాంతిలాల్‌ దండేతో మాట్లాడారు. అనంతరం తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రులు మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో 21 వేల మంది ఉద్యోగస్థులకు నివాసాలు కల్పించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తుందని అన్నారు.

తొలిదశ రాజధాని నిర్మాణంలో సెక్రటరేట్‌, అసెంబ్లీ, రాజభవనం, ఎమ్మెల్యే క్వార్టర్స్‌ ఉంటాయని చెప్పారు. జూన్‌ 5, 6, 8 తేదీల్లో ముఖ్యమంత్రి గుంటూరు జిల్లా పర్యటన ఉంటుందన్నారు. 5 న వ్యవసాయ విశ్వవిద్యాలయం శంకుస్థాపన, 6న మందడంలో రాజధాని భూమి పూజ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారన్నారు.

జూన్‌ 8న నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న స్థలంలో ఏడాది పాలన విజయోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు. ఐదువందల ట్రాక్టర్లతో భూమి పూజ రోజున చదును కార్యక్రమం చేయటానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విజయ దశమి రోజున మోడీతో రాజధాని శంకుస్థాపన జరుగుతుందని చెప్పారు.

English summary
AP CM Chandrababu writes letter to Arun Jaitley
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X